Arthana Binu : హీరోయిన్ ఇంటి గోడ దూకి బెదిరిస్తున్న వ్యక్తి.. సాక్ష్యాలను ఇన్‌స్టాలో పోస్ట్..

టాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అర్థనా బిను.. కొన్నిరోజులు నుంచి ఈ హీరోయిన్ మీడియాలో నిలుస్తుంది. తాజా ఈ భామ..

South Heroine Arthana Binu viral post about her father

Arthana Binu : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హీరోయిన్ ‘అర్థనా బిను’. కేరళకు చెందిన ఈ భామ తెలుగులో ఈ సినిమా తరువాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం మలయాళం, తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే, కొన్నిరోజులు నుంచి ఈ హీరోయిన్ మీడియాలో నిలుస్తుంది. తమ తండ్రి తమని బెదిరిస్తున్నాడు అంటూ కొన్ని రోజులు క్రితం ఒక వీడియో షేర్ చేయడం, అందులో ఆమె తండ్రి గోడ దూకుతూ కనిపిస్తుంది.

Kajol : రాజకీయ నాయకుల పై కాజోల్‌ వ్యాఖ్యలు వివాదం అవ్వడంతో.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఇక ఆ వీడియో పై ఆమె తండ్రి స్పందిస్తూ.. తనని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మీడియా ముందు తెలియజేశాడు. ఇక దీని పై అర్థనా బిను తన ఇన్‌స్టాలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సాక్ష్యాలతో సహా తెలియజేసింది. హీరోయిన్ చెల్లి గేట్ తియ్యడం వలనే ఆమె తండ్రి లోపలి వచ్చినట్లు మీడియా ముందు తెలియజేశాడు. అయితే అది అబద్దం అని, కొన్ని రోజులు క్రిందట షేర్ చేసిన గోడ దూకుతున్న వీడియో గమనిస్తే గేట్ కి లోపల నుంచి తాళం వేసి ఉంటది అని చెప్పుకొచ్చింది.

Madhavi Latha : బిగ్‌బాస్ సీజ‌న్ 7 ఆఫ‌ర్ నిజ‌మే.. టాలీవుడ్ హీరోయిన్ మాధ‌వీల‌త‌.. ఇప్ప‌టికీ మూడు సార్లు..

అలాగే తన భార్యతో అధికారికంగా విడాకులు ఇంకా రాలేదంటూ తన తండ్రి చేసిన ఆరోపణలు కూడా తప్పని తెలియజేసింది. తన తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక తన చెల్లి చదువు కోసమని తన తండ్రి 40 వేలు బ్యాంకు అకౌంట్ వేసిన విషయాన్ని కూడా అర్థనా బిను తప్పు బట్టింది. తన తండ్రి తమకి 10 లక్షల రూపాయలు మరియు బంగారం బాకీ ఉన్నాడని, అలాగే నెలవారీగా ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ బకాయికి కూడా బకాయిపడ్డాడని. ఆయన పేర్కొన్న 40,000 తమకి చెల్లించాల్సిన డబ్బు యొక్క వాయిదాలు మాత్రమే అంటూ వెల్లడించింది. ఈ లావాదేవీలు, విడాకులు వివరాలు మొత్తం ఆమె ఇన్‌స్టా పోస్ట్ లో షేర్ చేసింది.