Peddi Trailer Review : ట్రైలర్ వచ్చేసింది.. ‘పెద్ది’ కథ ఇదేనా.. అసలు ఆటకూలీ అంటే ఏంటి..?
ట్రైలర్ తో ఆల్మోస్ట్ కథ చెప్పేసాడు బుచ్చిబాబు. (Peddi Trailer Review)
Ram Charan Peddi Trailer
Peddi Trailer Review : ఎంతగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. చరణ్ మూడు గేమ్స్ లో అదరగొట్టాడు అని తెలుస్తుంది. అలాగే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ తో ఆల్మోస్ట్ కథ చెప్పేసాడు బుచ్చిబాబు.
ట్రైలర్ చూస్తుంటే.. విజయనగరం బ్యాక్ డ్రాప్ లో చెరుకు ఫ్యాక్టరీలో కొంతమంది కూలీలు పనిచేస్తారు. వాళ్ళు కొండల్లో ఉండే ఓ ఊరు నుంచి వస్తారు. అలాగే వాళ్లంతా డబ్బుల కోసం ఆట కూలీలుగా మారతారు. అంటే కొన్ని ఆటల్లో పోటీలు ఉంటే డబ్బున్నవాళ్ళు బాగా ఆడేవాళ్ళను తమవైపు డబ్బు ఇచ్చి ఆడించుకుంటారు. చరణ్ తో పాటు, అతని చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది డబ్బుల కోసం క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. లాంటి గేమ్స్ ఆడతారు. అక్కడ డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు డబ్బులు పెట్టి ఈ ఆట కూలీలతో గేమ్స్ ఆడిస్తారు, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆడిస్తారు అని తెలుస్తుంది.
Also Read : Ram Charan : ‘పెద్ది’ ట్రైలర్ లో అదరగొట్టిన రామ్ చరణ్.. ఫొటోలు..
ఇలా ఆడించే వాళ్లలో దివ్యేందు శర్మ, అజయ్ ఘోష్ కనిపించబోతున్నారు. చరణ్ తన ఊరి వాళ్ళ కోసం, వాళ్ళని ఆట కూలీలుగా చంపుతున్నారని, తన ఊరిని మార్చడానికి ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్దవాళ్ళని కలవడానికి ట్రై చేస్తాడు. పెద్ది తనకు వచ్చిన చెరుకు పని చేసుకుంటూ అక్కడ చెరుకు రసం బండి నడుపుతూ తిరుగుతుంటాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. గతంలో చరణ్ ఊరికి వచ్చిన బోమన్ ఇరానీ అక్కడ ఢిల్లీలో చరణ్ ని చూసి రన్నింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేలా చేస్తాడని తెలుస్తుంది.
ఇక శివరాజ్ కుమార్ కుస్తీ నేర్పించే పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు చరణ్ ఊరి పెద్దగా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక పెద్ది సినిమా ఇలా మూడు ఆటలతో, ఆట కూలీ నేపథ్యంలో, ఓ ఊరి జనాల జీవితాలు మార్చడానికి చరణ్ ఏం చేసాడు అని ఎమోషనల్ గా ఎలివేషన్స్ తో సాగనుందని పెద్ది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ట్రైలర్ అయితే అదిరిపోయింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఫ్యాన్స్ ని చరణ్, బుచ్చిబాబు ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.
