Ram Charan : అప్పుడు నాన్న – శ్రీదేవి.. ఇప్పుడు నేను – జాన్వీ.. పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చరణ్ స్పీచ్.. ఏమన్నాడంటే..
ఈ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ.. (Ram Charan)
Ram Charan Speech
Ram Charan : ఎంతగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ నేడు వచ్చేసింది. ట్రైలర్ చూసి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత హైప్ పెంచుకున్నారు. చరణ్ మూడు గేమ్స్ లో అదరగొట్టాడు అని తెలుస్తుంది. అలాగే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహమాన్, నిర్మాత వెంకట సతీష్, రత్నవేలు, దివ్యేందు శర్మ.. పలువురు హాజరయ్యారు.
Also Read : Peddi Trailer Review : ట్రైలర్ వచ్చేసింది.. ‘పెద్ది’ కథ ఇదేనా.. అసలు ఆటకూలీ అంటే ఏంటి..?
ఈ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మాలో నిండిపోయింది. రెండేళ్లుగా ఈ సినిమాని మేము ప్రేమిస్తున్నాం. బుచ్చిబాబు అయితే ఐదేళ్ల నుంచి ఈ సినిమా మీదే బతుకుతున్నాడు. దివ్యేందు శర్మ గ్యాంగ్ స్టర్ లాంటివాడు. అతనికి ఒక స్వాగ్ ఉంది. అతన్ని చూసి నేను బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి. జాన్వీ చాలా కష్టపడి పనిచేస్తుంది. లాస్ట్ సాంగ్ లో జాన్వీ నా కంటే చాలా బాగా డ్యాన్స్ చేసింది. చాలా సైలెంట్ గా అన్ని నేర్చుకుంటుంది. చాలా సిన్సియర్ గా ఉంటుంది.
మా నాన్న, శ్రీదేవి గారు కలిసి గతంలో పనిచేసారు. మా ఫ్యామిలీ, మా ఫ్యాన్స్, చాలా మందికి మేమిద్దరం కలిసి పనిచేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఇది నెరవేరింది. ఇది ఒక నాస్టాలజి ఫీలింగ్ మాకు. మా పెయిర్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. ఇదంతా బుచ్చిబాబు వల్లే. నా చెయ్యి ప్రస్తుతం బాగానే ఉంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 30 రోజులు కుస్తీ షూటింగ్ జరిగింది. దాని కోసం మంచి ఆర్టిస్టులను తెమ్మంటే రియల్ కుస్తీ ప్లేయర్లను తెచ్చారు. వాళ్ళు రియల్ గా గేమ్ ఆడారు. చాలా గాయాలు అయ్యాయి. ఇవి అన్ని పెద్ది జ్ఞాపకాలు.
ఫిజికల్ గా ఈ సినిమా నాకు చాలా కష్టం అయింది. సల్మాన్ సర్, ఆమీర్ సర్ సుల్తాన్, దంగల్ సినిమాలు నన్ను ఇన్ స్పైర్ చేసాయి. అమీర్ సర్, సల్మాన్ సర్ కుస్తీ సినిమాలు ఎలా చేసారో. చాలా కష్టం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా కష్టపడ్డాను. స్టోరీ చెప్పగానే ఇది ఫిజికల్ గా చాలా కష్టం అని అర్థమైంది. వెంటనే చేస్తాను అని చెప్పా. ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే జర్నీ ఈ పెద్ది సినిమా. నా లైఫ్ లో ఇన్స్పైరింగ్ సినిమాల్లో ఇది ఒకటి. మా నాన్న ఎవరికైనా ఇలాంటి సినిమాలు రావాలంటే ఒక దశాబ్దం పడుతుంది. ఇలాంటి సినిమా రాదు వదులుకోకు అని చెప్పారు. మగధీర వచ్చిన చాలా ఏళ్లకు రంగస్థలం, RRR అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వెంటనే పెద్ది వచ్చింది. నా లైబ్రరీలో ఎప్పటికి ఉండే సినిమా ఇది అని అన్నారు.
Also See : Ram Charan : ‘పెద్ది’ ట్రైలర్ లో అదరగొట్టిన రామ్ చరణ్.. ఫొటోలు..
