2022 Cannes Film Festival: ఈసారి కాన్స్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సౌత్ స్టార్స్!

75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇండియన్ సౌత్ స్టార్స్ కు సాదరంగా వెల్కమ్ చెబుతోంది. రెడ్ కార్పెట్ పై ఇక్కడి హీరోయిన్స్ గ్లామర్ ఒలకపోయనున్నారు.

2022 Cannes Film Festival: 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇండియన్ సౌత్ స్టార్స్ కు సాదరంగా వెల్కమ్ చెబుతోంది. రెడ్ కార్పెట్ పై ఇక్కడి హీరోయిన్స్ గ్లామర్ ఒలకపోయనున్నారు. గతంలో అమితాబ్, ఐశ్వర్య, ప్రియాంక వంటి బాలీవుడ్ స్టార్స్ కే దక్కిన గౌరవం.. సౌత్ వాళ్లకి ఈసారి లభించింది. ఇంకా ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం.

Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్.. పూజా హెగ్డే. వరుస ఫ్లాపులతో సతమవుతోన్న బుట్బబొమ్మకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 17 నుంచి 28 వరకూ జరిగే 75వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో మన దేశం తరఫున పూజా ప్రతినిధిగా పార్టిసిపేట్ చేయనుంది. పూజాతో పాటూ నయనతార, తమన్నా కూడా కాన్స్ రెడ్ కార్పెట్ పై నడిచే ఛాన్స్ కొట్టేసారు. గతంలో దీపికా పదుకోన్‌, ఐశ్వర్యరాయ్‌, కంగనా రనౌత్‌, ప్రియాంకా చోప్రా వంటి సీనియర్స్‌ కు మాత్రమే ఈ రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఫస్ట్ టైమ్ సౌత్ లో వెలుగుతోన్న హీరోయిన్స్ ని ఈ అవకాశం వరిచింది. దీని వెనక కూడా పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమా మెరవడమే కారణం.

Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

ఫ్రాన్స్ లో జరుగబోతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఇండియా తరఫున అక్షయ్‌ కుమార్, దీపికా పదుకోన్, ఏఆర్‌ రెహమాన్, పూజా హెగ్డే, నయనతార, తమన్నా వంటి వారు కనిపించబోతున్నారు. ఈ ఉత్సవాల్లో జ్యూరీ మెంబర్ గా దీపికా బాధ్యతలు నిర్వహించనుంది. భారతదేశం తరపున క్లాసిక్‌ సినిమా విభాగంలో సత్యజిత్‌ రే ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్‌ కానుంది. అలాగే మే 19న మాధవన్‌ నటించి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’షో పడబోతుంది. కమల్‌హాసన్‌, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ‘విక్రమ్‌’ట్రైలర్‌ ను కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు