TV Serials
TV Serials : కన్నడ యాంకర్, నటి సౌమ్య తెలుగులో కూడా పలు సీరియల్స్ చేసింది. జబర్దస్త్ లో యాంకర్ గా మెప్పించింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య ఇండస్ట్రీలో తను ఫేస్ చేసిన పలు ఇబ్బందులను తెలిపింది.
సౌమ్య ఓ సీరియల్ సమయంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ.. ఇక్కడ హీరో, హీరోయిన్స్ ని ఒకలా చూస్తారు. మిగిలిన వాళ్ళను ఇంకోలా చూస్తారు. నేను చేసే సీరియల్ కి మంచి రేటింగ్ వస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్ ని దేవతలా చూస్తారు. ఒక రోజు ఆ సీరియల్ హీరోయిన్ అందులో హీరోతో గొడవ పెట్టుకుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ షూటింగ్ లో అందరి మీద ఫ్రస్టేషన్ చూపించింది. షూటింగ్ అయ్యేక హీరో వచ్చి నాతో ఏదో మాట్లాడుతున్నాడని హీరోయిన్ వచ్చి కార్ లో హారన్ కొట్టింది. హీరో కాసేపాగి వస్తాను అన్నాడు. కార్ పక్కన పెట్టి నీకెంతమంది కావాలి అని హీరోతో గొడవపడింది. నాతో గొడవపడితే మూసుకొని పో అన్నాను. నన్ను వేరే స్టేట్ నుంచి వచ్చావు అన్నట్టు మాట్లాడింది. వెళ్ళిపోతూ కార్ రివర్స్ చేసి వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది.
Also Read : Sowmya : ఒక లాయర్ నాతో మిస్ బిహేవ్ చేసాడు.. వాళ్ళ వైఫ్, అమ్మ పక్కకి వెళ్తే చాలు నా మీద చేతులు వేసి..
సీరియల్ లో మంచి క్యారెక్టర్ లా నటిస్తారు. బయట ఏమో రియాలిటీలో వరస్ట్ గా ఉంటారు. అది జనాలకు తెలియదు. కార్ తో గుద్దిన తర్వాత రెండు రోజులు షూటింగ్ కి రాలేదు. నిర్మాత ఆ హీరోయిన్ ని ఏం అడగలేదు. ఎందుకంటే రేటింగ్ వస్తుంది కాబట్టి. నేను డైరెక్టర్ ని అడిగా నీ చెల్లికో, వైఫ్ కో ఇలా ఏం చేయకుండా వచ్చి తిట్టి కొడితే ఊరుకుంటావా, రేటింగ్ వస్తే మాత్రం ఆమెను దేవతాల చూస్తారా అని ఫైర్ అయ్యా. డైరెక్టర్ ఆమె వెళ్ళిపోతే కష్టం, రేటింగ్ తగ్గిపోద్ది అన్నట్టు మాట్లాడాడు. దాంతో.. అంటే నేను వెళ్ళిపోతే పర్లేదా అని సీరియల్ మానేశా.
సీరియల్స్ లో చాలా వరస్ట్ థింగ్స్ జరుగుతాయి. ఏదైనా తప్పు జరిగితే నేను ప్రశించేదాన్ని. అందుకే నాకు ఆఫర్స్ తగ్గిపోయాయి. స్ట్రైట్ గా ఉంటే కష్టం ఇక్కడ. ఇండస్ట్రీ మంచిదే. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే చెడ్డవాళ్ళు. జర్నలిజం చేసి ఎందుకు ఇటు వచ్చాను అని తిట్టుకున్నాను నన్ను నేను. నా దగ్గర డబ్బులు ఉండి, సొంత ప్రాపర్టీ ఉంటే నేను అసలు ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. కానీ ఇక్కడకు వచ్చేసాను కాబట్టి బయటకు రాలేము అని ఇక్కడే ఉన్నాను. జాబ్ మంచిది ఇండస్ట్రీ కంటే. చాలా సార్లు ఇక్కడైకి వచ్చినందుకు రిగ్రెట్ అవుతాను అని తెలిపింది.
Also Read : Anchor Sowmya : యాక్సిడెంట్ అయినా, రక్తం కారుతున్నా యాంకరింగ్ చేయడానికి వెళ్లిన యాంకర్..