SP Balu Final rites: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన తామరైపాక్కంలోని ఫామ్‌హౌస్‌లో తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
కాగా అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే అనుమతినిచ్చారు. బాలు కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరి ఎస్పీ శైలజ, మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు.