Special story about Samantha wedding ring?
Samantha-Raj: టాలీవుడ్ టాప్ స్టార్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె సోమవారం ఉదయం వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమంలో జరిగిన ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల నుంచి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం తన రెండవ వివాహాన్ని అధికారికంగా ప్రకటించింది సమంత. దీంతో ఈ పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Ashu Reddy: గ్లామర్ డోస్ పెంచిన ఆషు రెడ్డి.. ఎద అందాలు చూస్తే మతిపోవాల్సిందే.. ఫొటోలు
అయితే, ఈ పెళ్ళిలో సమంతకు రాజ్(Samantha-Raj) తొడిగిన ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న రింగ్ ని సమంత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట రాజ్. అంతేకాదు, ఈ రింగ్ డిజైన్ లో కూడా చాలా ప్రత్యేకమైన, శక్తివంతమైన అంశాలు ఉన్నాయట. ఉంగరం నాలుగు మూలలకు సంబంధించి ఒక్కో మూలకి ఒక్కో ప్రత్యేకత ఉందట. ప్రత్యేకమైన డైమండ్, పచ్చ రత్నాలతో చేయించిన ఈ రింగ్ లో మొదటి మూల- స్పష్టత, నిజాయితీ, నిష్కాపట్యతను సూచిస్తుందట. రెండవ మూలా- బలం, స్థితిస్థాపకతపై నిర్మించిన సంబంధాన్ని సూచిస్తుందట. మూడవ మూల- శాశ్వతమైన బంధం, ధోరణులను సూచిస్తుందట. నాలిగా మూల సమయాన్ని భరించే ప్రేమను సూచిస్తుందట. ఇలా సమంత పట్ల తనకున్న ప్రేమ, గౌరవాన్ని సూచించేలా రాజ్ ఈ ఉంగరాన్ని డిజైన్ చేయించాడట. దీంతో ఆ ఉంగరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక సమంత-రాజ్ తమ వివాహాన్ని కూడా అతి శక్తివంతమైన ‘భూత శుద్ది వివాహం’ అనే యోగ సంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ది వివాహం’ చేసుకుంటే ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధం ఏర్పడుతుందని ప్రతీతి. లింగ భైరవి దేవాలయాల్లో, ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ వివాహ క్రతువుని నిర్వహిస్తారు. దంపతుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది ఈ ప్రక్రియ. అలాగే దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేస్తుంది. సమంత మొదటి వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. ఆలాగే దర్శకుడు రాజ్ జీవితంలో కూడా ఇది రెండో పెళ్లి. అందుకే ఈ బంధమైనా బలంగా నిలవాలని ఈ ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్నారు సమంత-రాజ్.