Spider Man : స్పైడర్ మ్యాన్.. ఇండియాలో ఏకంగా 10 భాషల్లో గ్రాండ్ రిలీజ్.. ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ చేసిన హాలీవుడ్..

స్పైడర్ మ్యాన్ సినిమాలు తెలియని వారు ఉండరు. ఇండియాలో కూడా స్పైడర్ మ్యాన్ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Spider Man : Across the Spider-Verse సినిమా భారీ ఎత్తున రాబోతుంది.

Spider Man : Across the Spider-Verse grand releasing India in 10 Languages

Spider Man :  హాలీవుడ్(Hollywood) సినిమాలకు ఇండియా(India)లో మంచి మార్కెట్ ఉంది. చాలా వరకు హాలీవుడ్ సినిమాలు ఇండియాలో ఇంగ్లీష్(English) లోనే రిలీజ్ అవుతాయి. చాలా పెద్ద సినిమాలు మాత్రమే కొన్ని లోకల్ భాషల్లో కూడా రిలీజవుతాయి. RRR తర్వాత హాలీవుడ్ కి ఇండియన్ సినీ మార్కెట్ పై కన్నుపడింది. గతంతో పోలిస్తే హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు ఇండియన్ మార్కెట్ మీద మరింత ఫోకస్ చేశాయి. ఇండియాకు వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారంటే హాలీవుడ్ వాళ్ళు ఇండియన్ మార్కెట్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో అర్థంచేసుకోవచ్చు.

ఇప్పుడు మరో భారీ సినిమా ఇండియన్ మార్కెట్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. స్పైడర్ మ్యాన్ సినిమాలు తెలియని వారు ఉండరు. ఇండియాలో కూడా స్పైడర్ మ్యాన్ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Spider Man : Across the Spider-Verse సినిమా భారీ ఎత్తున రాబోతుంది. ఇది యానిమేషన్ సినిమాగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. స్పైడర్ మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అంతే గ్రాండ్ గా అదే రోజు ఇండియాలో కూడా ఈ స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ కాబోతుంది.

Hrithik Roshan : అంబానీ పార్టీలో ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్ రోషన్

ఈ సారి స్పైడర్ మ్యాన్ సినిమాను ఇండియాలో దాదాపు 10 భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు మరో నాలుగు భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇండియాలో ఓ హాలీవుడ్ సినిమా ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి. దీంతో స్పైడర్ మ్యాన్ రిలీజ్ తోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి స్పైడర్ మ్యాన్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.