Spirit Issue : ఇండైరెక్ట్ గా దీపికాకు సపోర్ట్ చేసిన మణిరత్నం, అజయ్ దేవగణ్.. అదొక్కటే సమస్య కాదు అంటున్న సినిమా లవర్స్, ఫ్యాన్స్..

స్పిరిట్‌ కాంట్రవర్సీ తారాస్థాయికి చేరడమే కాకుండా వర్కింగ్‌ అవర్స్‌పై పెద్ద చర్చ జరిగేలా చేస్తోంది.

Spirit Issue Manirathnam Supports to Deepika Padukone over Sandeep Reddy Vanga

Spirit Issue : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ స్పిరిట్. ఫుల్‌ హైప్‌, ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్ ను తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతలోనే ఆమె స్పిరిట్ మూవీ నుంచి తప్పుకోవడం ఇష్యూ అయింది. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్‌ విషయంలో దీపికా డిమాండ్లు పెట్టడంతో సందీప్ రెడ్డి వంగా ఆమెను తొలగించారని అంటున్నారు.

దీంతో దీపికా పీఆర్ టీమ్‌ స్పిరిట్ స్టోరీని లీక్ చేశారని వారికి సందీప్ మాస్ వార్నింగ్ ఇస్తూ పెట్టిన పోస్ట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా దీపికపై విమర్శలు చేసారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా సినిమా చేసేందుకు దీపిక డిమాండ్‌ చేసిన భారీ రెమ్యూనరేషన్‌, కండీషన్స్‌ నచ్చకపోవడంతో ఆమె ప్లేస్‌లో త్రిప్తి డిమ్రీని సెలెక్ట్‌ చేశారు. దీంతో స్పిరిట్‌ కాంట్రవర్సీ తారాస్థాయికి చేరడమే కాకుండా వర్కింగ్‌ అవర్స్‌పై పెద్ద చర్చ జరిగేలా చేస్తోంది. అసలు ఇండస్ట్రీలో ఎన్నిగంటలు పనిచేయాలనే ప్రశ్నపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : RGV : సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. చాలా పాతది.. కోట్ల మంది చూసే సినిమాని అయిదుగురు ఎలా డిసైడ్ చేస్తారు?

లేటెస్ట్‌గా ఈ దీనిపై డైరెక్టర్‌ మణిరత్నం రియాక్ట్‌ అవ్వడంతో ఈ వర్కింగ్‌ అవర్స్ టాపిక్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రజెంట్‌ థగ్‌లైఫ్‌ ప్రమోషన్స్‌తో ఫుల్‌బిజీగా ఉన్న డైరెక్టర్‌ మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో షూటింగ్‌ వర్కింగ్‌ అవర్స్‌పై రియాక్ట్ అయ్యారు. యాక్టర్స్‌ 8 అవర్స్‌ మాత్రమే షూటింగ్‌ చేస్తామని డిమాండ్‌ చేయడంలో తప్పులేదన్నారు డైరెక్టర్‌ మణిరత్నం. ఓ రకంగా ఇది సరైన డిమాండే అన్నారు మణి. ఒక డైరెక్టర్‌గా ఈ విషయాన్ని తాను పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. యాక్టర్స్‌ అలా అడగడంలో తప్పు లేదని, ఇది అవసరమైన విషయమేనంటూనే ఈ ఇష్యూకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలన్నారు మణి.

ఇదే టాపిక్‌పై అజయ్ దేవ్‌గణ్‌ కూడా రియాక్ట్ అయ్యారు. కాజోల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న మా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ టాపిక్‌పై స్పందించారు. నిజాయతీ ఉన్న దర్శకనిర్మాతలు ఎవరూ వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరని చెప్పారు. 8 అవర్స్‌ షూటింగ్‌లో పాల్గొంటే చాలు అనుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారని, అదే పాటిస్తారన్నారు. అయితే వీరి కామెంట్స్ పై సందీప్ వంగ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.

Also See : Vishnupriyaa Nikhil Prithvi : నిఖిల్ – విష్ణుప్రియ -పృథ్వీ.. బిగ్ బాస్ కాంబో.. స్పెషల్ ఫొటోలు ..

దీపికా ఇష్యూలో కేవలం వర్కింగ్ అవర్స్ మాత్రమే సమస్య కాదని, రెమ్యునరేషన్, స్టోరీ లీక్, చాలా డిమాండ్స్ చేసిందని.. ఇలాంటివి ఉన్నాయని అన్నారు. అలాగే వర్కింగ్ అవర్స్ తన ఇష్టం అయితే ప్రాజెక్టులో ఉంచాలా తీసెయ్యాలా డైరెక్టర్ ఇష్టం అని అంటున్నారు. అయినా సినిమా కోసం ఎన్ని గంటలైనా పనిచేసే స్టార్స్ చాలా మంది ఉన్నారని, అందుకు వాళ్ళు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, సినిమా 9-5 జాబ్ కాదని సినిమా లవర్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తానికి సందీప్ ని బ్యాడ్ చేయడానికి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న బాలీవుడ్ కి ఈ ఇష్యూలో ఎవరేం మాట్లాడినా సందీప్ ని కార్నర్ చేస్తున్నారు.