RGV : సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. చాలా పాతది.. కోట్ల మంది చూసే సినిమాని అయిదుగురు ఎలా డిసైడ్ చేస్తారు?

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆర్జీవీ సెన్సార్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

RGV : సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. చాలా పాతది.. కోట్ల మంది చూసే సినిమాని అయిదుగురు ఎలా డిసైడ్ చేస్తారు?

Ram Gopal Varma RGV Sensational Comments on Censor Board

Updated On : June 3, 2025 / 7:46 PM IST

RGV : ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రస్తుతం తన ట్వీట్స్ తో, తన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు పై పలుమార్లు కామెంట్స్ చేసారు. తన సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సెన్సార్ బోర్డు పై కౌంటర్లు వేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆర్జీవీ సెన్సార్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు చాలా పాతది. 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి వచ్చింది అది. అప్పుడు డిజిటల్, యూట్యూబ్, సోషల్ మీడియా ఏం లేవు. ఇప్పుడు అన్ని ఉన్నాయ్ అన్ని ఆన్లైన్ లో చూస్తున్నాం. కానీ సినిమా కొంతమందే చూడాలి అనేది స్టుపిడిటీ. ఆడియన్స్ ని పిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు. వీళ్ళు ఇది చూడకూడదు అని డిసైడ్ చేస్తారు. ఒక అయిదుగురు ఎవరో కూర్చొని కోట్ల మంది చూసే సినిమాని ఎలా డిసైడ్ చేస్తారు.

Also Read : Baby Combo : ‘బేబీ’ కాంబో.. ఆనంద్ – వైష్ణవిలతో తీయాల్సిన సినిమా.. వాళ్ళని పక్కన పెట్టి హీరో హీరోయిన్స్ ని మార్చేసి..

కొంతమంది సెన్సార్ ఆఫీసర్స్ కూడా చెప్పారు వాళ్ళది ఓల్డ్ సిస్టమ్ అని. కానీ కొంతమంది పిల్లలు చెడిపోతారు అని పాత మాటలు మాట్లాడతారు. పోర్న్, వైలెన్స్ కూడా ఫోన్ లో చూసేస్తున్నారు కానీ సినిమాలో ఏదన్నా బూతు పదం పెట్టినా తీసేయమంటారు. పాత సినిమాటోగ్రఫీ యాక్ట్ అదే నడుస్తుంది. దాన్ని మార్చట్లేదు. అమెరికాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్నా వాటికీ రేటింగ్స్ ఇస్తారు కానీ కట్స్ చెప్పరు. పిల్లలు కూడా అన్ని ఫోన్స్ లో చూసేస్తుంటే సెన్సార్ బోర్డు కటింగ్స్ ఎందుకు అని అన్నారు.

ఆర్జీవీ వ్యాఖ్యలపై పలువురు సపోర్ట్ చేస్తుంటే, పలువురు తప్పు పడుతున్నారు. అయితే మారిన సినిమాల ట్రెండ్, జనాల మైండ్ సెట్ ని బట్టి సెన్సార్ బోర్డు నిబంధనలు కొద్దిగా మార్చాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. ఓటీటీలోనే అడల్ట్, వైలెన్స్ కంటెంట్ పూర్తిగా లభ్యం అవుతున్నప్పుడు సినిమాలకు కట్స్ చెప్తే ఎందుకు వస్తారు అని కూడా అన్నారు ఆర్జీవీ.

Also Read : Prabhas – Kannappa : కన్నప్ప ప్రమోషన్స్ కి ప్రభాస్.. నార్త్ లో ట్రైలర్ లాంచ్.. సౌత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..