Prabhas – Kannappa : కన్నప్ప ప్రమోషన్స్ కి ప్రభాస్.. నార్త్ లో ట్రైలర్ లాంచ్.. సౌత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..
తాజా సమాచారం ప్రకారం కన్నప్ప సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

Prabhas will be Guest for Manchu Vishnu Kannappa Movie Pre Release Event
Prabhas – Kannappa : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో భారీ కాస్ట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది. విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. ప్రభాస్ పోస్టర్స్ ని, టీజర్ లో ప్రభాస్ విజువల్స్ ని రిలీజ్ చేసారు.
తాజా సమాచారం ప్రకారం కన్నప్ప సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. కన్నప్ప పాన్ ఇండియా సినిమా కావడంతో ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సినిమాలో నటించిన అక్షయ్ కుమార్, ప్రభాస్ హాజరవుతారని విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవేళ ప్రభాస్ కి కుదరక ముంబై ఈవెంట్ కి రాకపోతే హైదరాబాద్ లో రిలీజ్ కి ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని, ఆ ఈవెంట్ కి ప్రభాస్ ని తీసుకొస్తామని తెలిపాడు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. విష్ణు కోసం, మోహన్ బాబు కోసం ప్రభాస్ వస్తాడని అంటున్నారు. మోహన్ బాబు అడిగాడనే ప్రభాస్ ఈ పాత్ర డబ్బులు కూడా తీసుకోకుండా చేస్తున్నాడని విష్ణు గతంలో తెలిపాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా ప్రభాస్ ని తీసుకొస్తాను అని చెప్పడంతో ప్రభాస్ ఇమేజ్ ని విష్ణు బాగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాడని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు.