Baby Combo : ‘బేబీ’ కాంబో.. ఆనంద్ – వైష్ణవిలతో తీయాల్సిన సినిమా.. వాళ్ళని పక్కన పెట్టి హీరో హీరోయిన్స్ ని మార్చేసి..

ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ ని మార్చేసి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు అని తెలుస్తుంది.

Baby Combo : ‘బేబీ’ కాంబో.. ఆనంద్ – వైష్ణవిలతో తీయాల్సిన సినిమా.. వాళ్ళని పక్కన పెట్టి హీరో హీరోయిన్స్ ని మార్చేసి..

Kiran Abbavaram Gowri Priya Replaced with Baby Combo Anand Deverakonda and Vaishnavi Chaitanya

Updated On : June 3, 2025 / 6:22 PM IST

Baby Combo : కిరణ్ అబ్బవరం – గౌరీప్రియ జంటగా నిర్మాత SKN నిర్మాణంలో డైరెక్టర్ సాయి రాజేష్ ఇచ్చిన కథతో రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాని ప్రకటించి నిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ చెన్నై సముద్రం ఒడ్డున కూర్చొని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే చెన్నైలో జరిగే లవ్ స్టోరీ కథతో మరో ప్రేమ కథ సినిమాగా రాబోతుంది అని తెలుస్తుంది.

అయితే ఇదే కాంబోలో గతంలో ఒక సినిమా ప్రకటించారు. ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ ని మార్చేసి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు అని తెలుస్తుంది. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆనంద్ – వైష్ణవిలని పెట్టి రవి నంబూరి దర్శకత్వంలోనే SKN, సాయి రాజేష్ గతంలో ఒక సినిమాని ప్రకటించారు. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసి షూటింగ్ స్టార్ట్ అయింది అని ప్రకటించారు.

baby

Also Read : Prabhas – Kannappa : కన్నప్ప ప్రమోషన్స్ కి ప్రభాస్.. నార్త్ లో ట్రైలర్ లాంచ్.. సౌత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..

అయితే ఇప్పుడు అదే దర్శకుడు అదే బ్యాక్ డ్రాప్ తో కిరణ్ అబ్బవరం – గౌరీప్రియ జంటగా సినిమా ప్రకటించడంతో ఆ సినిమానే ఈ సినిమా అని తెలిసిపోతుంది. వాళ్ళిద్దరితో చేసిన షూట్ పక్కన పెట్టేసి కొత్తగా ఈ ఇద్దరితో చేస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఆనంద్ – వైష్ణవి సూపర్ హిట్ కాంబోని ఎందుకు పక్కన పెట్టారో, హీరో హీరోయిన్స్ ని ఎందుకు మార్చారో తెలియాలి. ఈ చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ మీడియా ముందుకు వస్తే దీనికి సమాధానాలు దొరుకుతాయేమో.

kiram abbavaram