Salaar : ప్రభాస్ ఫ్యాన్స్‌కి టికెట్స్ అందించిన నిఖిల్.. థియేటర్ లో శ్రీవిష్ణు విజిల్స్..

సలార్ రిలీజ్ సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ యంగ్ హీరోలో నిఖిల్, శ్రీవిష్ణు సందడి.

Sree Vishnu Nikhil Siddhartha in Prabhas Salaar movie celebrations

Salaar : ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఎదురు చూసిన సలార్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం సీజ్ ఫైర్ నేడు పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారంతా బెనిఫిట్ షోస్, మార్నింగ్ షోల్లోనే మూవీని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.

ఈక్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ప్రభాస్ సినిమాని మొదటి షోలోనే చూసేందుకు తెల్లవారుజామున థియేటర్స్ కి చేరుకున్నారు. తెలుగు యువ హీరోలు నిఖిల్, శ్రీవిష్ణు ఉదయం సలార్ సినిమాని వీక్షించారు. ఇక ప్రభాస్ అభిమానుల కోసం ఒక వంద టికెట్స్ ని కొనుగోలు చేసిన నిఖిల్.. ఆ టికెట్స్ ని ప్రభాస్ వీరాభిమానులకు అందజేశారు. తమ హీరో మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన టికెట్స్ ని తమకి బహుమతిగా ఇవ్వడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ నిఖిల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Also read : Prabhas : సలార్ రిలీజ్‌కి ముందు ప్రభాస్ మరదలు వైరల్..

ఇక తెల్లవారుజామున థియేటర్ కి వచ్చిన శ్రీవిష్ణు అభిమానులతో కలిసి థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. తాను ఒక హీరో అని మర్చిపోయి, ప్రభాస్ అభిమానిగా థియేటర్ లో విజిల్స్ వేస్తూ ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని రెబల్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీస్, దర్శకులు కూడా సినిమా చూసేందుకు థియేటర్స్ కి చేరుకుంటున్నారు. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడంతో రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, ఈ రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఒక అపశృతి చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా 29 ఏళ్ళ వయసు ఉన్న బాలరాజు విద్యుత్ షాక్ కి గురై మరణించాడు. ఈ విషయం తోటి అభిమానులను బాధిస్తుంది.