Gaayapadda Simham : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీ విష్ణు గెస్ట్ రోల్.. ట్రంప్ మీద యుద్ధం..
మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Gaayapadda Simham)
Gaayapadda Simham
Gaayapadda Simham : తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా గాయపడ్డ సింహం. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి, భాను కిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ కుమార్ నిర్మాణంలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అమెరికాకు వెళ్లాలన్న ఓ అబ్బాయి ట్రంప్ పెట్టె రూల్స్ తో వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఏం చేసాడు అనే కథతో కామెడీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. జెడి చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా శ్రీ విష్ణు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ తో, ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also See : Tejaswini Vygha : హ్యాపీ వీకెండ్ అంటూ.. దిల్ రాజు భార్య తేజస్విని క్యూట్ సెల్ఫీలు..
గాయపడ్డ సింహం సినిమా మే 1న రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..
