Sreejita De : ఆటోలో ప్రియుడికి ఘాటు లిప్ లాక్‌కిస్ ఇచ్చిన బాలీవుడ్ భామ.. వీడియో వైరల్!

ముంబైలోని ఒక ఆటోలో బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ శ్రీజితా డి.. ప్రియుడికి ఘాటు లిప్ లాక్‌కిస్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Sreejita De liplock for her Michael Blohm Pape in mumbai auto rickshaw

Sreejita De : బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ శ్రీజితా డి.. ఇటీవల జర్మన్ వ్యక్తి మైఖేల్ బ్లోమ్ పాపే (Michael Blohm Pape) వివాహం చేసుకోవడంతో బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది. జూన్ 30న జర్మనీలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వీరిద్దరూ.. జూలై 1న ఇరు కుటుంబాల సమక్షంలో క్రిస్టియన్ వెడ్డింగ్‌లో ఒకటయ్యారు. ఆ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను శ్రీజితా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కాగా ఈ కొత్త జంట.. తాజాగా ముంబై విధుల్లో కనిపించారు.

Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ స‌రికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన

మైఖేల్ తో కలిసి శ్రీజితా ముంబైలోని ఒక ఆటోలో కనిపించింది. ఇక వీరిద్దర్నీ గుర్తించిన ఆటో డ్రైవర్.. ఆటోలో పెళ్లి చేసుకోమని కోరాడు. ఇక ఆ ఆటో డ్రైవర్ కోరికను నెరవేస్తూ.. ఇంగ్లీష్ పద్ధతి లిప్ లాక్ ఇచ్చి పెళ్లి చేసుకొంది. ఆ సీన్ చూసిన డ్రైవర్ అండ్ ఇతర వ్యక్తులు వన్స్ మోర్ అంటూ కామెంట్స్ చేయగా.. శ్రీజితా మరోసారి మైఖేల్ కి లిప్ లాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దీని పై కొందరు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

Rajinikanth : నేను జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అదే.. సూప‌ర్ స్టార్ బిరుదుతో ఎప్పుడూ స‌మ‌స్యే : ర‌జినీకాంత్‌

కాగా శ్రీజితా.. మైఖేల్ ని ఒక రెస్టారెంట్‌ లో కలుసుకుంది. అప్పుడు నెంబర్స్ మార్చుకున్న వీరిద్దరూ 2019 నుంచి డేటింగ్ చేస్తూ వచ్చారు. దాదాపు రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత, మైఖేల్ ప్యారిస్‌లో శ్రీజితకు ప్రపోజ్ చేశాడు. 2021 డిసెంబర్ లో మైఖేల్ ని నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత COVID-19 వల్ల వీరిద్దరి వివాహం వాయిదా పడింది. ఆ తరువాత మొన్న జులై 1న కేవలం కుటుంబసభ్యుల మరియు అతితక్కువమంది స్నేహితులు మధ్య వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.