Sreeleela : ఆ రాష్ట్రంలో శ్రీలీల సినిమా షూటింగ్.. ముఖ్యమంత్రిని కలవడంతో.. ఫోటో వైరల్..

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమాతో శ్రీలీల ఎంట్రీ ఇవ్వనుంది.

Sreeleela and Karthik Aryan Meets Sikkim Chief Minister Prem Singh Tamang Photo goes Viral

Sreeleela : శ్రీలీల ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. శ్రీలీల ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాలతో బిజిగా ఉంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమాతో శ్రీలీల ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. అది ఆషికి 3 సినిమా అని టాక్ నడుస్తుంది.

అయితే తాజాగా శ్రీలీల, కార్తీక్ ఆర్యన్, డైరెక్టర్, మూవీ యూనిట్ సిక్కిం రాష్ట్రానికి వెళ్లారు. సిక్కింలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. దీంతో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ని కలిశారు మూవీ యూనిట్. సీఎం ముఖ్యమంత్రి మూవీ యూనిట్ ని సత్కరించి వారికి జ్ఞాపికలను అందించారు. మూవీ టీమ్ తో సిక్కిం ముఖ్యమంత్రి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also Read : Hit 3 Song : నాని హిట్ 3 సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. లవ్ మెలోడీ వినేయండి..

శ్రీలీల, కార్తీక్ ఆర్యన్, మూవీ టీమ్ తో దిగిన ఫోటోని సిక్కిం ముఖ్యమంత్రి తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసి.. బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ బసు, యాక్టర్స్ కార్తీక్ ఆర్యన్, శ్రీలీలను మా ఇంట్లో కలవడం ఆనందంగా ఉంది. వీరు రాష్ట్రంలో వారం రోజుల పాటు ఉండనున్నారు. వాళ్ళ సినిమా షూటింగ్ ని ఇక్కడ సిక్కిం లొకేషన్స్ లో చేయనున్నారు. వారి సినిమా మా రాష్ట్రం అందాలు, సంస్కృతి, సంప్రదాయాలు చూపించనుంది. వారికి మా అభినందనలు తెలియచేస్తున్నాము అని పోస్ట్ చేసారు. మరి శ్రీలీల బాలీవుడ్ మొదటి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.