Sreeleela-Tilak Varma : తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్.. మరో ఐదేళ్లు..
నటి శ్రీలీల, తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా క్రికెటర్ తిలక్ వర్మలు (Sreeleela-Tilak Varma ) ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Sreeleela and Tilak Varma dating rumors actress mother respond
- క్రికెటర్ తిలక్ వర్మ, నటి శ్రీలీల డేటింగ్ రూమర్లు
- స్పందించిన శ్రీలీల తల్లి స్వర్ణలత
- అవన్నీ పుకార్లే, ఏ మాత్రం నిజం లేదు
Sreeleela-Tilak Varma : నటి శ్రీలీల, తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా క్రికెటర్ తిలక్ వర్మలు ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందించారు. అవన్నీ రూమర్లేనని స్పష్టం చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించడానికి శ్రీలీలకు సమయం లేదన్నారు. మరో ఐదేళ్ల తరువాతనే పెళ్లి విషయం గురించి ఆలోచిస్తుందని తెలిపారు.
‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమైనవి. ఇలాంటి వార్తలు ఎలా పుట్టకొస్తాయో తెలియడం లేదు. వీటిల్లో ఆవగింజ అంత నిజం కూడా లేదు. వారిద్దరు ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. ప్రస్తుతం శ్రీలీల చదువు, నటనతోనే బిజీగా ఉంది. కొంచెం సమయం దొరికినా ఆమె నీట్ పీజీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోంది. ప్రస్తుతానికి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం లేదు. ఇందుకు ఐదారు సంవత్సరాల సమయం ఉంది.’ అని స్వర్ణలత తెలిపారు.
Rahasya Gorak : ప్రకృతితో మమేకమైన కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య గోరఖ్ ఫోటోలు..
గతేడాది డిసెంబర్లో నటి శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ సైతం తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నాడు. ఆ తరువాత వాంఖడే వేదికగా జరిగిన ఓ టీ20 మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అంటూ ఊహాగానాలు మొదలు అయ్యాయి. తాజాగా వాటికి శ్రీలీల తల్లి స్వర్ణలత చెక్ పెట్టింది.
కాగా.. శ్రీలీల పై డేటింగ్ రూమర్లు రావడం ఇదే తొలిసారి కాదు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఆమె డేటింగ్లో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా స్వర్ణలత స్పష్టత ఇచ్చారు. కార్తీక్ వాళ్ల మదర్, నేను డాక్టర్లు కావడంతోనే వృతిపరంగా కలిశామని, అంతకు మించి మరేమీ లేదని స్పష్టం చేశారు.
