Sreeleela: క్లారిటీ వచ్చేసింది.. ఈ పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల..

తనలో మరింత జోష్‌ నింపిందని చెప్పింది.

హీరోయిన్‌ శ్రీలీలకు సామాజిక స్పృహ, సేవా దృక్పథం చాలా ఎక్కువ. ఇప్పటికే ఆమె దివ్యాంగులైన ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఆమె రీసెంట్‌గా మరో పాపకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది.

తమ ఇంటికి మరొకరు వచ్చారని శ్రీలీల పేర్కొంది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పాప ఎవరంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. మరో పాపను దత్తత తీసుకున్నారా? అని కొందరు అడిగారు.

Also Read: అవును రెండో పెళ్లి చేసుకుంటాను.. అంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసిన జాను.. ఇంకా ఏమందంటే?

దీనిపై ఇప్పుడు శ్రీలీల స్పష్టత ఇచ్చింది. ఆ పాప తన సోదరి కూతురు అని, తమ ఇంటికి కొత్త కళ తీసుకొచ్చిందని పేర్కొంది. తనలో మరింత జోష్‌ నింపిందని చెప్పింది. శ్రీలీల పోస్ట్ చేసిన ఈ ఇన్‌స్టా స్టోరీతో ఆ పాప ఎవరో తెలిసిపోయింది.

ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీలీల ఆ పాపతో ఆడుకుంటూ కనిపించింది. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటెంగ్ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలోనూ శ్రీలీల ఐటెం సాంగ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల ఇటీవల రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ సరసన నటించింది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ అమ్మడి చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో శ్రీలీలకు మంచి ఫాలోయింగ్ ఉంది.