అవును రెండో పెళ్లి చేసుకుంటాను.. అంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసిన జాను.. ఇంకా ఏమందంటే?

ఇష్టపడ్డామని, కలిసి జీవించాలనుకుంటున్నామని..

అవును రెండో పెళ్లి చేసుకుంటాను.. అంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసిన జాను.. ఇంకా ఏమందంటే?

Updated On : May 3, 2025 / 4:17 PM IST

ఫోక్‌ డ్యాన్సర్‌ జాను లిరి రెండో పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. రెండో పెళ్లి చేసుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తాను ఇక ట్రోలింగ్ గురించి పట్టించుకోనని చెప్పింది. “అవును.. నేను రెండో పెళ్లి చేసుకుంటాను” అని ఆమె చెప్పడం గమనార్హం.

తాను అందరికీ సమాధానమిస్తానని, వివాహం అనంతరం కూడా తన కొడుకుతో చాలా సంతోషంగా ఉంటానని చెప్పింది. ట్రోల్స్ కారణంగా కృంగిపోనని స్పష్టం చేసింది. తనకు కాబోయే భర్త, ఫోక్‌ సింగర్‌ దిలీప్‌ దేవ్‌గన్‌తో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. అటు దిలీప్‌ దేవ్‌గన్‌ కూడా ఇదే ఫొటోను పోస్ట్ చేశాడు. తమను ఆశ్విరదించాలని వారిద్దరు పేర్కొన్నారు.

జాను గతంలో ఒకరిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. విభేదాల కారణంగా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. జాను రెండో వివాహం చేసుకోనుందని సోషల్‌ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది.

అటు దిలీప్‌ దేవ్‌గన్‌ ఇన్‌స్టాలో ఓ వీడియాని పోస్ట్‌ చేస్తూ.. తన పాటలను ఆదరించి, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రేక్షకులకు నమస్కారం అని అన్నాడు. ఇటీవల తాను పోస్ట్‌ చేసిన ఓ ఫొటోను ట్రోల్‌ చేస్తున్నారని, తాను, జాను పెళ్లి చేసుకుంటున్నామని విషయం నిజమేనని ప్రకటించాడు. తాము పరస్పరం ఇష్టపడ్డామని, కలిసి జీవించాలనుకుంటున్నామని చెప్పాడు.

తమ ఇంట్లో కూడా పెళ్లికి అంగీకరించారని తెలిపాడు. కాగా, ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2 షోలో జాను విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోయింది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Jimmidi Jhansi – Janulyri (@janulyri_official)