Sreeleela Dance : అక్కడ పనిచేస్తున్న మహిళలతో శ్రీలీల క్యూట్ డ్యాన్స్ చూశారా..? వీడియో వైరల్..

ప్రస్తుతం శ్రీలీల రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Sreeleela Dance with Working Women in Annapurna Studios Video goes Viral

Sreeleela Dance : శ్రీలీల కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ బిజీ అవుతుంది. టాలీవుడ్ లో, తమిళ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. త్వరలో నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శ్రీలీల రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Also Read : Aamir Khan : మళ్ళీ సౌత్ సినిమాల మీద కుళ్లుకున్న బాలీవుడ్ రైటర్.. కౌంటర్ ఇచ్చిన ఆమీర్ ఖాన్..

నిన్న శ్రీలీల రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళింది. అక్కడ పని చేస్తున్న కొంతమంది మహిళలతో కలిసి శ్రీలీల క్యూట్ గా డ్యాన్స్ వేసి వాళ్ళని అలరించింది. వాళ్ళని కూడా డ్యాన్స్ వేయించింది. దీంతో శ్రీలీల డ్యాన్స్ వైరల్ గా మారింది. మీరు కూడా శ్రీలీల మహిళలతో చేసిన డ్యాన్స్ చూసేయండి..

శ్రీలీల అందరితో మంచిగా మాట్లాడుతుంది. షూటింగ్స్ లో, బయట కూడా శ్రీలీల అందరితో కలివిడిగా ఉంటుంది. శ్రీలీలే స్వయంగా అలాంటి వీడియోలు గతంలో పలుమార్లు పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి శ్రీలీల పనివాళ్ళతో డ్యాన్స్ చేయడంతో ఆమెని అభినందిస్తున్నారు.