Aamir Khan : మళ్ళీ సౌత్ సినిమాల మీద కుళ్లుకున్న బాలీవుడ్ రైటర్.. కౌంటర్ ఇచ్చిన ఆమీర్ ఖాన్..
జావేద్ అక్తర్ రెగ్యులర్ గా సౌత్ దర్శకులు, సౌత్ సినిమాలను కించపరుస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి అలాగే మాట్లాడటంతో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Bollywood Star Aamir Khan Counter to Writer Javed Akhtar for Indirectly Insulting South Movies
Aamir Khan : సౌత్ సినిమాలు, ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో భారీ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలపై, టాలీవుడ్ సినిమాలపై కుళ్ళుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు సౌత్ సినిమాలపై తక్కువ చేసి మాట్లాడారు. వీరిలో రచయిత జావేద్ అక్తర్ ముందు వరసలో ఉంటాడు.
జావేద్ అక్తర్ రెగ్యులర్ గా సౌత్ దర్శకులు, సౌత్ సినిమాలను కించపరుస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి అలాగే మాట్లాడటంతో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ 60వ పుట్టిన రోజు సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్ ‘ఆమిర్ ఖాన్ : సినిమా కా జాదూగర్’ అనే వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంట్లో రచయిత జావేద్ అక్తర్, ఆమిర్ ఖాన్ మధ్య సంభాషణ సాగింది.
జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒకప్పటితో పోలిస్తే హిందీ సినిమాలు మన వాళ్లకు దగ్గర కాలేకపోతున్నాయి. అసలు మనవాళ్లకు ఏమైంది. సౌత్ సినిమాలు మాత్రం డబ్ అయి ఇక్కడ హిట్ కొడుతున్నాయి. ఇక్కడి ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అసలు హిందీ సినిమాకు, ప్రేక్షకులకు పరిచయం లేని సౌత్ నటీనటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది? మన బాలీవుడ్ కి ఏమైంది అని అన్నారు.
దీంతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ఒకప్పటిలాగా హిందీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. మనవాళ్ళు మూలాలు మర్చిపోతున్నారు. సౌత్ వాళ్ళు ఆ మూలలను కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. అయినా ఇక్కడ సౌత్, నార్త్ సినిమాలు అని బేధం ఏమి లేదు. సమస్య అంతా బాలీవుడ్ బిజినెస్ విధానంలోనే ఉంది. మన సినిమా వస్తుందని ప్రమోషన్ చేస్తాం, టికెట్ కొనుక్కొని సినిమాకి రండి అంటాం. ఒకవేళ థియేటర్స్ కి రాకపోతే కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఓటీటీని ప్రిఫర్ చేస్తున్నారు. గతంలో సినిమా కావాలంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా బాగుంటే తప్ప థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదు. అందుకే ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు. మన సినిమాని, మన బిజినెస్ ని మనమే నాశనం చేస్తున్నాం అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.