Kiran Abbavaram Bike : కిరణ్ అబ్బవరం ఫేవరేట్ బైక్ గెలుచుకుంది ఇతనే.. సంతోషం మాములుగా లేదుగా.. బైక్ గెలుచుకున్నాక ఏమన్నాడంటే..
కొన్ని రోజుల క్రితం ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Kiran Abbavaram Gives his Favorite Bike to Dilruba Contest Winner
Kiran Abbavaram Bike : కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ కాబోతుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం స్పెషల్ గా తయారు చేసిన ఓ బైక్ ని వాడాడు. అది తన ఫేవరేట్ బైక్ అయిందని, సినిమాలో ఆ బైక్ వాడాను అని చెప్పాడు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ చూసి మా సినిమా కథేంటి అని కరెక్ట్ గా కనిపెట్టిన వాళ్లకు మేమే పిలిచి ఈ బైక్ గిఫ్ట్ గా ఇస్తామని తెలిపాడు కిరణ్. దిల్ రూబా కథని గెస్ చేసిన వాళ్ళు #Dilruba తో ట్విట్టర్ లో ఆ కథ ప్లాట్ పోస్ట్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్లకు దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బైక్ ని ఇస్తామని ప్రకటించారు.
ఈ కాంటెస్ట్ లో చాలా మంది పాల్గొన్నారు. అందులో గెలిచిన వ్యక్తికి నిన్న రాత్రి ఈవెంట్లో ఈ బైక్ ని ఇచ్చాడు కిరణ్. కిరణ్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి రామాంజనేయులు అనే వ్యక్తి ఈ బైక్ గెలుచుకున్నాడు, కంగ్రాట్స్. ఆల్మోస్ట్ 20 వేల మంది పోస్ట్ చేసారు. అందులో మా టీమ్ కష్టపడి 20 మంది పర్ఫెక్ట్ గా రాసిన వాళ్ళను ఫైనల్ చేసారు. అందులో లక్కీ డిప్ తీస్తే ఇతనికి బైక్ వచ్చింది. ఈ బైక్ ఇతనికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ బైక్ అంటే ఇష్టం. అది ఇతను గెలుచుకున్నాడు కంగ్రాట్స్ అని అతన్ని స్టేజిపైకి పిలిచి అతనికి బైక్ ఇచ్చారు.
Also Read : Kudumbasthan : ‘కుడుంబస్థాన్’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలతో కామెడీ..
ఇక బైక్ గెలుచుకున్న రామాంజనేయులు మాట్లాడుతూ.. నేను అసలు ఊహించలేదు. అసలు మనకి రాదులే అనుకున్నాను. కానీ నేను అనుకున్న కథ జస్ట్ అలా పోస్ట్ చేశాను. నిన్న నైట్ నాకు సినిమా టీమ్ నుంచి కాల్ వచ్చింది. నువ్వు ఇలా బైక్ గెలుచుకున్నావు, రేపు సాయంత్రం ఈవెంట్ ఉంది. రేపు ఉదయం ఎలాగైనా హైదరాబాద్ రావాలి అన్నారు. నేను వచ్చాక మూవీ టీమ్ వాళ్ళు బాగా చూసుకున్నారు. కిరణ్ అన్న మధ్యాహ్నం ఫుల్ గా భోజనం పెట్టాడు. చాలా బాగా మాట్లాడాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందాక నిర్మాత గారు మాట్లాడుతూ ఈ సినిమా నచ్చకపోతే నన్ను కొట్టండి అని చెప్పారు. ఒకవేళ హిట్ అవ్వకపోతే సర్ తో పాటు నన్ను కూడా కొట్టండి. థ్యాంక్యూ ఈ బైక్ ఇచ్చిన్నందుకు అని అన్నారు.
బైక్ గెలుచుకున్న వ్యక్తి ఫుల్ ఆనందంతో మాట్లాడాడు. కిరణ్ ఇలా కాంటెస్ట్ పెట్టి పిలిపించి మరీ బైక్ ఇవ్వడంతో ఫ్యాన్స్, నెటిజన్లు కిరణ్ ని అభినందిస్తున్నారు.