Kudumbasthan : ‘కుడుంబస్థాన్‌’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలతో కామెడీ..

సమాజంలో ఫ్యామిలీని పోషించే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాలను కామెడీ వచ్చేలా చూపించారు సినిమాలో.

Kudumbasthan : ‘కుడుంబస్థాన్‌’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలతో కామెడీ..

Manikandan Saanve Megghana Kudumbasthan Movie Review

Updated On : March 12, 2025 / 7:35 AM IST

Kudumbasthan Movie Review : మణికందన్, శాన్వి మేఘన జంటగా తెరకెక్కిన సినిమా ‘కుడుంబస్థాన్‌’. వినోద్ కుమార్ నిర్మాణంలో రాజేశ్వర్ కలిసామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గురు సోమసుందరం, సుందర్ రాజన్, నివేదిత రాజప్పన్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ తమిళ్ సినిమా జనవరి 24న థియేటర్స్ లో రిలీజయి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కథ విషయానికొస్తే.. నవీన్(మణికందన్), వెన్నెల(శాన్వి మేఘన) లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. వెన్నెల ఇంట్లో వాళ్ళు దూరమవగా నవీన్ ఇంట్లోనే కాపురం పెట్టినా నవీన్ తల్లి వెన్నెలని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నవీన్ ది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాస్త డబ్బున్న వ్యక్తికి నవీన్ అక్కని ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు. అతని బావ(సోమసుందరం) అంటే నవీన్ కి అస్సలు పడదు. డబ్బు లేదని, లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని ఎగతాళి చేస్తూ ఉంటాడు నవీన్ బావ. ఇంట్లో ఖర్చులు, తల్లి భక్తి ఖర్చులు, వెన్నెల ఐఏఎస్ ప్రిపరేషన్ ఫీజులు, నాన్న కోసం ఖర్చు.. ఇలా శక్తికి మించి డబ్బులు అవసరమవుతాయి.

నవీన్ గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ పక్క తన భార్య వెన్నెల ప్రగ్నెంట్ అయి ఖర్చులు మరింత పెరుగుతాయి. కొన్ని రోజుల్లో జాబ్ లో మంచి పొజిషన్ కి వెళ్తాను అనుకునేలోపు అనుకోకుండా తన ఫ్రెండ్ వల్ల జాబ్ పోతుంది. దీంతో ఇంట్లో ఏం చెప్పాలో తెలియక, ఖర్చులు ఎలా చూడాలో తెలియక ఓ పక్క జాబ్ ట్రైల్స్ చేస్తూ మరో పక్క అప్పులు చేస్తాడు. మరి ఆ అప్పులతో నవీన్ పడ్డ ఇబ్బందులు ఏంటి? నవీన్ కి జాబ్ వచ్చిందా? వాళ్ళ బావ నవీన్ ని ఎలా ఇబ్బంది పెట్టాడు? నవీన్ భార్య ఐఏఎస్ పాస్ అయిందా? నవీన్ డబ్బు సంపాదించట్లేదని తెలిసాక ఇంట్లో వాళ్ళు ఎలా చూసారు? వెన్నెల పేరెంట్స్ వచ్చారా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Kiran Abbavaram : ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా.. వాళ్లకు హెల్ప్ చేస్తానని స్టేజి మీద మాట ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. నిజంగా గ్రేట్..

సినిమా విశ్లేషణ.. సమాజంలో ఫ్యామిలీని పోషించే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాలను కామెడీ వచ్చేలా చూపించారు సినిమాలో. సినిమా చూస్తున్నంతసేపు రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఫ్యామిలీని పోషించే మగవాళ్ల పరిస్థితి ఇంతే కదా అనిపిస్తుంది. డబ్బు సంపాదించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా ఈ రోజుల్లో విలువ ఇవ్వరు, డబ్బు లేకపోతే మనకు మాట్లాడే అర్హత కూడా ఉండదు, రిలేటివ్స్ అందరూ మన డబ్బునే చూస్తారు అనే పాయింట్స్ ని చక్కగా ఎమోషనల్ గా చూపించారు.

హీరో పాత్రకి ఫ్రెండ్స్ ని పెట్టి వాళ్ళతో నవ్వించినా హీరో డబ్బులు లేక పడే కష్టాలతో, అతని ఫ్రస్టేషన్ తోనే మనకు నవ్వొస్తుంది. మరో పక్క నవీన్ – వెన్నెల పాత్రలతో భార్యాభర్తల బంధం కూడా బాగా చూపించారు. సినిమా అంతా నవ్వించి చివర్లో కాస్త ఎమోషనల్ చేసారు. కుడుంబస్థాన్‌ అంటే తమిళ్ లో ఫ్యామిలీ మ్యాన్ అని అర్ధం. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కథ. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రస్తుతం జీ5 లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Kudumbasthan Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. మణికందన్ ఇప్పటికే పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ప్రతి సినిమాలోనూ చాలా న్యాచురల్ గా నటిస్తాడు. ఈ సినిమాలో కూడా మణికందన్ బాధ్యతలు మోసే మిడిల్ క్లాస్ వ్యక్తిగా అదరగొట్టేసాడు. శాన్వి మేఘన భార్య పాత్రలో మెప్పిస్తుంది. బావ పాత్రలో నటించిన సోమ సుందరం ఫుల్ గా నవ్విస్తాడు. తండ్రి పాత్రలో సుందర్ రాజన్, తల్లి పాత్రలో కనకం అక్కడక్కడా నవ్విస్తారు. నవీన్ ఫ్రండ్స్ పాత్రల్లో కనిపించిన ముగ్గురు కూడా అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Rajinikanth : 74 ఏళ్ళ వయసులో అంత కష్టం.. నిజంగానే సూపర్ స్టార్.. రెండు సినిమాలతో..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. సాంగ్స్ యావరేజ్. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది ఈ సినిమాకు. ఒక సింపుల్ పాయింట్ ని తీసుకొని మంచి సీన్స్ తో నవ్విస్తూనే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలు చూపించి ఎమోషనల్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘కుడుంబస్థాన్‌’ సినిమా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు చూపిస్తూ నవ్వించి ఎమోషనల్ చేసారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.