Kiran Abbavaram : ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా.. వాళ్లకు హెల్ప్ చేస్తానని స్టేజి మీద మాట ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. నిజంగా గ్రేట్..

ప్రతి సంవత్సరం ఓ పది మందికి హెల్ప్ చేస్తాను అని వేదికపై ప్రకటించాడు కిరణ్.

Kiran Abbavaram : ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా.. వాళ్లకు హెల్ప్ చేస్తానని స్టేజి మీద మాట ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. నిజంగా గ్రేట్..

Kiran Abbavaram Wants to Help ten Members per Year Who have passion in movies with low financial status

Updated On : March 12, 2025 / 6:44 AM IST

Kiran Abbavaram : ఇప్పటి జనరేషన్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకొని, కృష్ణ నగర్ లో కష్టాలు పడి హీరోగా ఎదిగిన తక్కువ మందిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇటీవలే క సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా మాట్లాడారు. అంతే కాకుండా ప్రతి సంవత్సరం ఓ పది మందికి హెల్ప్ చేస్తాను అని వేదికపై ప్రకటించాడు కిరణ్.

దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను ఇక్కడ కష్టాలు పడ్డాను కాబట్టి నాకు తెలుసు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ సినిమాల్లోకి వస్తా అంటే ఏ ఇంట్లో అయినా వద్దంటారు. ఎవరూ సపోర్ట్ చేయరు. నా జర్నీలో చాలా మంది తిరిగి వెళ్లిపోయారు సక్సెస్ అవ్వక. నేను ఎప్పుడూ అనుకునేవాడిని నేను గట్టిగా నిలబడితే అలాంటివాళ్లకు హెల్ప్ చేయాలి అని. స్టార్ హీరోలు, పెద్ద హీరోలు వాళ్లకు తగినంత హెల్ప్ చేసారు, చేస్తున్నారు. కానీ నాకు తోచినంతలో నా రేంజ్ లో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నేను చిన్న స్థాయిలో ఉన్నాను. అయినా నాకు తగినంతలో హెల్ప్ చేస్తాను. ఈ స్టేజిపై మాట ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి ఉండి నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని కష్టపడే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఫైనాన్షియల్ సమస్యలు ఉంటే ప్రతి సంవత్సరం ఒక పది మందిని నేను చూసుకుంటాను.

Also Read : Bollywood : పాపం బాలీవుడ్.. హీరోయిన్స్ కరువయ్యారు.. సౌత్ వాళ్ళే దిక్కు..

అది ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు నేను ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా ఓ పదిమందికి సహాయం చేస్తాను. ఇవాళ నేను ఓ పది మందికి సహాయం చేసే రేంజ్ లో ఉన్నాను. ఫ్యూచర్ లో ఇంకా ఎదిగితే 100 మందికి, వేల మందికి కూడా సహాయం చేస్తాను. నాకు సినిమా పిచ్చి ఉంది, నేను సినిమాల్లో ఎదుగుదాం అనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే అలాంటి ఒక పదిమందికి బేసిక్ నీడ్స్ నేను చూసుకుంటాను. నేను అక్కడ్నుంచి అన్ని చూసి వచ్చాను కాబట్టి ఇది చెప్తున్నాను. కృష్ణ నగర్ లో మేము ఒక 50 మంది మొదలుపెడితే ఇవాళ ఇద్దరు కూడా లేరు. ఎందుకు అంటే హోప్ లేక, ఫైనాన్షియల్ సమస్యలు, డబ్బులు లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. అందుకే నేను ఇది చేయాలి అనుకుంటున్నాను. నేను మాట తప్పను. సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్తవాళ్లు, ట్యాలెంట్ ఉన్నవాళ్లు ఇక్కడికి రండి అని అన్నారు.

Also Read : Rajinikanth : 74 ఏళ్ళ వయసులో అంత కష్టం.. నిజంగానే సూపర్ స్టార్.. రెండు సినిమాలతో..

దీంతో కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఎంత సినిమా పిచ్చి ఉంటే ఇలాంటి సహాయం చేస్తా అంటాడు అని ఫ్యాన్స్, నెటిజన్లు కిరణ్ ని అభినందిస్తున్నారు.