Bollywood : పాపం బాలీవుడ్.. హీరోయిన్స్ కరువయ్యారు.. సౌత్ వాళ్ళే దిక్కు..

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల కోసం బాలీవుడ్ నుంచి భామలను తెచ్చేవాళ్ళు.

Bollywood : పాపం బాలీవుడ్.. హీరోయిన్స్ కరువయ్యారు.. సౌత్ వాళ్ళే దిక్కు..

Commercial Heroins Shortage in Bollywood Movies

Updated On : March 11, 2025 / 9:08 PM IST

Bollywood : ప్రజెంట్ బాలీవుడ్ లో హిట్సే కాదు అక్కడి ఆడియెన్స్ ని హీటెక్కించే హీరోయిన్సూ కరువయ్యారు. అసలు స్టార్ హీరోల పక్కన పెడదామంటే హీరోయిన్లే లేకుండాపోయారు. బాలీవుడ్ పేరు వినగానే గుర్తొచ్చేది ఖాన్స్, కపూర్లే కాదు అందమైన హీరోయిన్స్ కూడా. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల కోసం బాలీవుడ్ నుంచి భామలను తెచ్చేవాళ్ళు. అలాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల కౌంట్ సడన్ గా డౌన్ ఫాల్ అయ్యింది. పట్టుమని 10 మంది కాదు కదా కనీసం ఐదారుగురు కూడా రెగ్యులర్ గా కనిపించడం లేదు.

అందరూ విమెన్ సెంట్రిక్ సినిమాలు, హీరోయిజం చూపించే సినిమాలు చేస్తూ సమ్ థింగ్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు కానీ స్టార్ హీరోయిన్ల పక్కన కమర్షియల్ సినిమాలు చేసే హీరోయిన్లే దొరకడం లేదు హిందీలో.

Also Read : Manchu Vishnu : సీఎం రేవంత్ రెడ్డితో మంచు విష్ణు మీటింగ్.. ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేశాను అంటూ ట్వీట్..

ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన దీపిక పాప పుట్టడంతో బ్రేక్ ఇచ్చింది. కత్రినా కైఫ్ పెళ్లైన దగ్గరనుంచి సినిమాలు తగ్గించేసింది. మొన్నమొన్నటి వరకూ ఎంటర్టైన్ చేసిన ఆలియా పాప పుట్టాక సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇక మిగిలిన కియారా అద్వానీ ప్రగ్నెంట్ అవ్వడంతో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక జాన్వి లాంటి హీరోయిన్లు అటు సీనియర్స్ తో సెట్ కాక, జూనియర్స్ తో చెయ్యలేక సౌత్ స్టార్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

శ్రద్ధ కపూర్ కి హిట్లు లేవు. సోనాక్షి సిన్హా కనపడట్లేదు. కృతి సనన్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. యామి గౌతమ్ వుమెన్ సెంట్రిక్ సినిమాలు చేసుకుంటుంది. దిశా పటాని అందాల ఆరబోతకు ఎక్కువ సినిమాలకు తక్కువ అన్నట్టు తయారైంది. ఇక మిగిలిన హీరోయిన్స్ అంతా చిన్న సినిమాల్లోనే కనిపిస్తున్నారు. వీళ్లు తప్పించి అంతగా బాలీవుడ్ ఆడియన్స్ కి నోటెడ్ అయిన హీరోయిన్లే లేరు. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేసే పనిలో ఉన్నారు సౌత్ హీరోయిన్లు.

Also Read : Janhvi Kapoor – Ram Charan : రామ్ చరణ్ సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న జాన్వీ కపూర్..

ఒకప్పుడు సౌత్ లో బాలీవుడ్ హీరోయిన్లని ఇంపోర్ట్ చేసుకుని డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ గ్లామ్ షో తో సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో హీరోయిన్లు లేక సౌత్ హీరోయిన్లనే సెలక్ట్ చేసుకుంటున్నారు. రకుల్, కాజల్, తమన్నా.. ఇక్కడ సౌత్ లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్.. పూజాహెగ్డే తో, షారూఖ్ ఖాన్ నయనతారతో సినిమాలు చేశారు. లేటెస్ట్ గా సల్మాన్ సికందర్ లో సౌత్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మిక తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇది చూస్తుంటే మరి ముందు ముందు సౌత్ హీరోయిన్లే బాలీవుడ్ ని ఓవర్ టేక్ చేస్తారేమో అనిపిస్తుంది.