Janhvi Kapoor – Ram Charan : రామ్ చరణ్ సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న జాన్వీ కపూర్..
RC16 షూటింగ్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

Janhvi Kapoor Working Night Shoots for Ram Charan Buchi babu Sana RC 16 Movie
Janhvi Kapoor – Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. RC16 షూటింగ్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. రామ్‌చరణ్, జాహ్నవి కపూర్ కాంబినేషన్‌లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న RC16 సినిమాలో చెర్రీ చేస్తున్న క్యారెక్టర్ ఏంటనే దానిపై ఫ్యాన్స్‌లో ఫుల్ ఎగ్జైట్‌మెంట్ ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అన్నీ కుదిరితే దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
రామ్‌చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఎక్కువ శాతం నైట్ సీన్స్ ఉన్నాయని టాక్. ఇంకా పేరు కన్ఫామ్ కానీ ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అయితే ఇప్పుడు అంతా నైట్ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంటుందట. నేడు రాత్రి నుంచే ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది.
Also Read : NTR Photos : ఏమున్నాడ్రా బాబు.. ఎన్టీఆర్ కొత్త స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్..
రెండు వారాలు పాటు నైట్ షూట్ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. జాన్వీ ఈ రెండు వారాలు రాత్రి షూట్స్ తో కష్టపడనుంది. రాజమౌళి మహేష్ మూవీ లీక్‌లు గమనించిన RC16 యూనిట్ అలా జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందంట. చిన్న క్లిప్ కూడా బయటకు రాకుండా చూసుకుంటున్నారట.
ఇక RC16 సినిమా స్టోరీ క్రికెట్ -రెజ్లింగ్ రెండు ఆటల నేపథ్యంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. పవర్ ఆఫ్ క్రికెట్ అనే వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ జరుగుతుందట. ఇక సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్టేట్ రాబోతుందంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న ఎనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. టైటిల్, గ్లింప్స్‌పై సినిమా యూనిట్ చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉందట.
Also Read : Divi : దివి అందానికి, బాడీ ఫిట్నెస్ కి ఏం చేస్తుందో తెలుసా? ఆ జ్యుస్ లు..
గేమ్‌ఛేంజర్ ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో RC16పై ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్‌చరణ్ ఈ సినిమా చేస్తున్నాడు. RC16 కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అవుతుంది. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితిల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.