Divi : దివి అందానికి, బాడీ ఫిట్నెస్ కి ఏం చేస్తుందో తెలుసా? ఆ జ్యుస్ లు..

తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Divi : దివి అందానికి, బాడీ ఫిట్నెస్ కి ఏం చేస్తుందో తెలుసా? ఆ జ్యుస్ లు..

Actress Divi Vadthya Tells about Her Beauty and Body Fitness Secret

Updated On : March 11, 2025 / 6:04 PM IST

Divi : సినిమా సెలబ్రిటీలు తమ అందం కాపాడుకోవడానికి బాగా కష్టపడతారని తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ తమ ఫేస్, బాడీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడానికి మరింత కష్టపడతారు. డైట్, ఫుడ్స్, జిమ్.. అంటూ జాగ్రత్తపడతారు. తాజాగా నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి తన అందం, తన బాడీ ఫిజిక్ మెయింటైన్ కి ఏం చేస్తుందో తెలిపింది.

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది దివి. బిగ్ బాస్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Also Read : Gaddar Awards : గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానం.. తెలంగాణ గద్దర్ అవార్డులకు ఎలా అప్లై చేయాలంటే..

ఈ ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. నేను కాకరకాయ జ్యుస్, మునగాకు జ్యుస్, వెజిటేబుల్ జ్యుస్, గ్రీన్ టీ తాగుతాను. ఇవి హెల్త్ కి, స్కిన్ కి మంచిది. మందారపువ్వు ఆకులు, ఆనియన్ జ్యుస్ తలకు పెడతాను మంచి హెయిర్ కోసం. ఇది కొన్ని ఇయర్స్ గా చేస్తున్నాను. అందుకే ఇలా ఉన్నాను. ఫుడ్ మ్యాగ్జిమమ్ అన్ని తింటాను కానీ బాగా ఎక్సర్ సైజ్ చేసి కరిగిస్తాను. రోజూ వర్కౌట్స్ కచ్చితంగా చేస్తాను అని తెలిపింది.

అలాగే.. నాకు వంట వచ్చు. ఖాళీగా ఉంటే వంట చేస్తాను. అన్ని వండుతాను. నాకు దొండకాయ ఫ్రై, పులిహార, పచ్చిపులుసు ఇష్టం. నాన్ వెజ్ కూడా అన్ని తింటాను అని తెలిపింది.