Manchu Vishnu : సీఎం రేవంత్ రెడ్డితో మంచు విష్ణు మీటింగ్.. ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేశాను అంటూ ట్వీట్..

తాజాగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Manchu Vishnu : సీఎం రేవంత్ రెడ్డితో మంచు విష్ణు మీటింగ్.. ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేశాను అంటూ ట్వీట్..

Manchu Vishnu and Mohan Babu Meets CM Revanth Reddy Photos goes Viral

Updated On : March 11, 2025 / 9:03 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేసారు. మంచు విష్ణు కన్నప్ప మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా, ఆసక్తికర విషయం ఉన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మంచు విష్ణు. ఇటీవల పలువురు ప్రముఖులను కూడా రెగ్యులర్ గా కలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Also Read : Janhvi Kapoor – Ram Charan : రామ్ చరణ్ సినిమా కోసం రాత్రుళ్ళు కష్టపడుతున్న జాన్వీ కపూర్..

మంచు విష్ణు సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి కొద్దిసేపు మాట్లాడారు. సీఎంతో దిగిన ఫోటోలను మంచు విష్ణు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. గౌరవనీయులైన ముఖ్యమంత్రో రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన్ని కలిసి ముఖ్యమైన కొన్ని అంశాలు మాట్లాడాము. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన అందిస్తున్న సపోర్ట్, ఆయన చూపిస్తున్న కమిట్మెంట్ అభినందించదగినది అంటూ పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది..

అయితే పలువురు నెటిజన్లు మంచు విష్ణు కన్నప్ప కోసమే సీఎంని కలిసాడు అని, కన్నప్ప టికెట్ రేట్ల పెంపు అడగడానికి కలిసాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు విష్ణు సీఎం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో..