Rajinikanth : 74 ఏళ్ళ వయసులో అంత కష్టం.. నిజంగానే సూపర్ స్టార్.. రెండు సినిమాలతో..

రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చెయ్యడం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల వల్ల కూడా కావడం లేదంటున్నారు.

Rajinikanth : 74 ఏళ్ళ వయసులో అంత కష్టం.. నిజంగానే సూపర్ స్టార్.. రెండు సినిమాలతో..

Super Star Rajinikanth Busy with Back to Back Movies

Updated On : March 11, 2025 / 9:24 PM IST

Rajinikanth : రజనీకాంత్ మనిషా లేక మిషనా అనుకుంటున్నారు అందరూ. 75 ఏళ్లకు దగ్గరవుతున్న ఈ వయసులో అసలు ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీ స్టైల్ నే కాదు స్పీడ్ ని మ్యాచ్ చెయ్యడం కూడా ఎవ్వరి వల్లా కాదు. ఒకటే సారి రెండు మూడు సినిమాలు కమిట్ అవ్వడం, వీలైతే రెండు సినిమాల్ని ప్యార్లల్ గా షూట్ చెయ్యడం, ఇలా రజనీకాంత్ ఫుల్ స్పీడ్ లో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు.

అసలు రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చెయ్యడం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల వల్ల కూడా కావడం లేదంటున్నారు. ఇదే స్పీడ్ లో రజనీ మరో క్రేజీ ప్రాజెక్ట్ జైలర్ 2 షూట్ కూడా మొదలుపెట్టేశారు. రజనీకాంత్ కెరీర్ కాస్త డల్ అయినప్పుడు బాక్సాఫీస్ ని బద్దలుకొట్టి మళ్ళీ రజనీ చరిష్మాని, క్రేజ్ ని, స్టామినాని చూపించింది జైలర్ మూవీ. రజనీకాంత్ తో సెటిల్డ్ ఫర్ఫార్మెన్స్ చేయిస్తూనే రజనీ మార్క్ ఎలివేషన్స్ ఎక్కడా మిస్ చేయకుండా ఆ సినిమాను తెరకెక్కించారు.

Also Read : Bollywood : పాపం బాలీవుడ్.. హీరోయిన్స్ కరువయ్యారు.. సౌత్ వాళ్ళే దిక్కు..

యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి తలైవా అభిమానుల్లో. అలాంటి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం, రజనీకాంత్ సెట్లోకి ఎంటరవ్వడంతో ఈ సినిమానుంచి రాబోతున్న అప్ డేట్స్ పై ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్.

మరో పక్క రజనీకాంత్ కూలీ సినిమా షూట్ లో బిజీ ఉన్నారు. కూలి అవ్వకుండానే జైలర్ 2 స్టార్ట్ చేసేశారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నెగెటివ్ షేడ్స్ తో తెరకెక్కుతోంది కూలీ మూవీ. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరీర్ లో రానటువంటి కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు కూలీ మూవీలో. అలా ఒకవైపు కూలీ మరోవైపు జైలర్ 2 సినిమాలు ప్యార్లల్ గా చేస్తూ ఈ ఏజ్ లో కూడా ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు రజనీకాంత్. జైలర్ 2 నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అయితే కూలీ మాత్రం ఈ సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.