Producer Ravi : కిరణ్ అబ్బవరం సినిమాలో ఫైట్స్ మీకు నచ్చకపోతే నన్ను చితక్కొట్టేయండి.. అంతేకాదు.. నిర్మాత వ్యాఖ్యలు.. ఇంత కాన్ఫిడెంట్ ఏంటి భయ్యా..

ఈవెంట్ లో సినిమా నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Producer Ravi : కిరణ్ అబ్బవరం సినిమాలో ఫైట్స్ మీకు నచ్చకపోతే నన్ను చితక్కొట్టేయండి.. అంతేకాదు.. నిర్మాత వ్యాఖ్యలు.. ఇంత కాన్ఫిడెంట్ ఏంటి భయ్యా..

Kiran Abbavaram Dilruba Movie Producer Ravi Interesting comments on fights on movie

Updated On : March 12, 2025 / 8:05 AM IST

Producer Ravi : కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సినిమా నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నిర్మాత రవి సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో.. థియేటర్స్ లో ఫైట్స్ చూసి మీరు తెరని చింపి ఆ రేంజ్ లో ఫీల్ అవ్వకపోతే ఆ రోజు మధ్యాహ్నం నేను పెట్టె ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. నన్ను కొట్టి బయటకు విసిరేయండి. కిరణ్ గారి ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే నేను ప్రొడ్యూసర్ గా మళ్ళీ సినిమా చేయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అని అన్నారు.

Also Read : Kudumbasthan : ‘కుడుంబస్థాన్‌’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలతో కామెడీ..

దీంతో సినిమా నిర్మాత ఇంత కాన్ఫిడెంట్ గా కొట్టమని చెప్తున్నాడేంటి. సినిమా ఆ రేంజ్ లో ఉందా అని చర్చ నడుస్తుంది. మొత్తానికి కిరణ్ అబ్బవరం సినిమాకి నిర్మాత చేసిన వ్యాఖ్యలతో కూడా మరింత మైలేజ్ వచ్చింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

అయితే ఇటీవల కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆ సినిమా నిర్మాత హీరో నాని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. కోర్ట్, దిల్ రూబా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.