Sreeleela : అసలు నేనెలా లవ్ చేస్తా.. ఎట్టకేలకు లవ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. అమ్మతో ముడిపెడుతూ..

కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల లవ్ రూమర్స్ బాలీవుడ్ లో బాగానే వైరల్ అయ్యాయి.

Sreeleela

Sreeleela : హీరో హీరోయిన్స్ ఎవరితో అయినా కనిపిస్తే చాలు వాళ్ళతో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని రూమర్స్ వచ్చేస్తాయి. ఇటీవల హీరోయిన్ శ్రీలీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. శ్రీలీల బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటిస్తుంది. శ్రీలీల అతనితో కొన్ని పార్టీలకు వెళ్లడం, కార్తీక్ తల్లి నాకు డాక్టర్ కోడలుగా రావాలని చెప్పడం, కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో శ్రీలీల పాల్గొనడం.. ఇలా పలు సంఘటనలతో శ్రీలీల కార్తీక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

కార్తీక్ ఆర్యన్ – శ్రీలీల లవ్ రూమర్స్ బాలీవుడ్ లో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వీటిని శ్రీలీల కానీ, కార్తిక్ ఆర్యన్ కానీ ఖండించలేదు. దీంతో అందరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని అనుకున్నారు. అయితే శ్రీలీల జూనియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసింది.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ షూట్ ఇంకా అవ్వలేదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది.. మిగిలిన షూట్ ఎప్పట్నుంచి..

శ్రీలీల తన ప్రేమ, పెళ్లిపై వచ్చే రూమర్స్ గురించి క్లారిటీ ఇస్తూ.. నేను ప్రేమలో పడ్డాను అని అందరూ అంటున్నారు. అసలు నేను ఎలా ప్రేమలో పడతాను. ప్రతిసారి మా అమ్మ నాతోనే ఉంటుంది. నేను వెకేషన్ కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ నా పక్కనే ఉంటుంది. అలాంటింది నేను ఎలా ప్రేమలో ఉంటాను. అందరూ నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా వయసు 23. కనీసం 30 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేసుకోను అని తెలిపింది. దీంతో శ్రీలీల ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేదని, అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చేసింది.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ కథ ఇదే.. మొత్తం లీక్ చేసేసిన దర్శకుడు .. అలా ఎలా చెప్పావు బ్రో..