Sreenu Vaitla
Sreenu Vaitla : ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోను విడాకులు ఎక్కువైపోయాయి. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ దంపతులు, ఇక్కడ నాగచైతన్య-సమంత, కోలీవుడ్ లో ధనుష్-ఐశ్వర్య.. ఇలా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నారు. ఇదే బాటలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా విడాకులు తీసుకున్నారు అని వినిపిస్తుంది. నీ కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్షా… లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. కానీ కొన్నేళ్లుగా హిట్ లేక వరుస పరాజయాలు చూస్తున్నారు.
ఇటీవల శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. రూపా ఫ్యషన్ డిజైనర్. కొన్ని సినిమాలకి కూడా ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. స్వయంగా వేదిక్ అనే ఫ్యాషన్ బ్రాండ్ తో బిజినెస్ కూడా చేస్తుంది. శ్రీనువైట్ల, రూపాలది ప్రేమ వివాహం. గత కొంతకాలంగా శ్రీనువైట్ల సక్సెస్ లో లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, ఆర్ధిక సమస్యలు ఉండటంతో రూపా శ్రీనువైట్లతో విడాకులు కోరినట్లు తెలుస్తుంది. గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి శ్రీనువైట్ల తనను వేధిస్తున్నాడని రూప కేసు కూడా పెట్టింది. చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, కానీ తాజాగా విడాకులు తీసుకోవడానికే ఫిక్స్ అయి, శ్రీనువైట్ల భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Sai Pallavi : బోనమెత్తిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటో..
కొన్ని రోజులుగా ఈ వార్త వినిపించినా వీరిద్దరూ దీనిపై స్పందించలేదు. తాజాగా శ్రీనువైట్ల చేసిన ట్వీట్ తో నిజంగానే వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తుంది. ట్విట్టర్లో తన భార్య, పిల్లలతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి.. ”జీవితం చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం” అంటూ తన భార్య, పిల్లల్ని ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశాడు. దీంతో తన భార్య పిల్లలని తీసుకొని వెళ్ళిపోయినట్టు, ప్రస్తుతం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నట్టు తెలుస్తుంది. చాలా మంది వీరిద్దరూ మళ్ళీ కలవాలని, శ్రీనువైట్ల మళ్ళీ ఫామ్ లోకి వచ్చి మంచి హిట్ సినిమా తీయాలని కామెంట్స్ చేస్తున్నారు.
Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022