Samajavaragamana Twitter Review : శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ట్విట్టర్ రివ్యూ.. సూపర్ ఫన్ అంట.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

శ్రీవిష్ణు గత మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీస్ కోసం స్పెషల్ ప్రీమియర్స్ వేయగా పాజిటివ్ టాక్స్ వచ్చాయి. సినిమా ఆద్యంతం హాయిగా నవ్వుకోవచ్చు అని అంటున్నారు.

Samajavaragamana Twitter Review : శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ట్విట్టర్ రివ్యూ.. సూపర్ ఫన్ అంట.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

Sreevishnu Samajavaragamana Movie Twitter Review and Audience rating

Updated On : June 29, 2023 / 7:29 AM IST

Samajavaragamana Twitter Review :  శ్రీవిష్ణు హీరోగా ‘సామజవరగమన’ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తుండగా నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ అబ్బరాజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. శ్రీవిష్ణు గత మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీస్ కోసం స్పెషల్ ప్రీమియర్స్ వేయగా పాజిటివ్ టాక్స్ వచ్చాయి. సినిమా ఆద్యంతం హాయిగా నవ్వుకోవచ్చు అని అంటున్నారు.

ఇక ‘సామజవరగమన’ సినిమా నేడు రిలీజవ్వగా ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కూడా పలు చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.