Sri Divya : తెలుగు హీరోయిన్ త్వరలో లవ్ మ్యారేజ్..?

ప్రస్తుతం శ్రీ దివ్య రైడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రశ్నించగా సమాధానమిచ్చింది.

Sri Divya get Love Marriage Soon rumours goes Viral

Sri Divya : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తెలుగమ్మాయి శ్రీ దివ్య తెలుగులో మనసారా(Manasara) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసిన గుర్తింపు రాకపోవడంతో తమిళ్ సినీ పరిశ్రమకు వెళ్ళింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది శ్రీదివ్య. తమిళ్, తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో తమిళ్ లో రైడ్(Raid) అనే సినిమాతో రాబోతుంది శ్రీ దివ్య.

ప్రస్తుతం శ్రీ దివ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రశ్నించగా సమాధానమిచ్చింది. శ్రీదివ్య తన పెళ్లిపై స్పందిస్తూ.. నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే, ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను. దానిని అధికారికంగా అనౌన్స్ చేస్తాను త్వరలోనే అని తెలిపింది.

Also Read : Varun lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం.. ఏ రోజు ఎన్ని గంటలకు..? ఫుల్ డీటెయిల్స్..

దీంతో శ్రీదివ్య ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి శ్రీదివ్యని పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరో మాత్రం చెప్పలేదు. పెళ్లి ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.