Chiranjeevi – Sridevi : మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని నేడు రీ రిలీజ్ చేసారు. ఈ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ లతో యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.
Also Read : Bhairavam : విజయ్ దేవరకొండకు పోటీగా.. మంచు మనోజ్ – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా..
ఇంటర్వ్యూలో చిరంజీవి.. ఈ సినిమా షూటింగ్ లో శ్రీదేవి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. అది ఎలక్ట్రానిక్ చెస్ బోర్డు. అది మ్యాన్యువల్ గా ఆడొచ్చు, దానంతట అదే ఆడుతుంది. ఇంగ్లాండ్ లో కొనుక్కొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. షూటింగ్ గ్యాప్ లో ఇద్దరం అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళం. మేము ఆడుకుంటుంటే అమ్రిష్ పూరి వచ్చి సరదాగా డిస్టర్బ్ చేసేవారు. ఇప్పటికి ఆ చెస్ బోర్డు మా ఇంట్లో ఉంది అంటూ అప్పటి సంగతులను తెలిపారు.