Srinidhi Shetty announce two Movies at a Time after Long Gap
Srinidhi Shetty : KGF సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది శ్రీనిధి శెట్టి. పలు బ్యూటీ పేజెంట్స్ లో పాల్గొని అవార్డులు దక్కించుకుంది. మోడలింగ్ రంగంలో కూడా పనిచేసింది. మొదటి సినిమానే KGF లాంటి భారీ సినిమాతో అవకాశం రావడం, రెండు KGF సినిమాలు భారీ హిట్ అవ్వడంతో శ్రీనిధి శెట్టి నేషనల్ వైడ్ పాపులర్ అయింది. కానీ ఆ పాపులారిటీతో ఛాన్సులు మాత్రం దక్కించుకోలేకపోయింది శ్రీనిధి.
KGF చేస్తున్నప్పుడే విక్రమ్ సరసన కోబ్రా సినిమా ఒప్పుకుంది. KGF 2 రిలీజయి భారీ విజయం సాధించడంతో శ్రీనిధి తన రెమ్యునరేషన్ కోటి రూపాయలకు పెంచేసిందని వార్తలు వచ్చాయి. రెండు సినిమాలకే హిట్ అయినంత మాత్రాన కోటి రూపాయలపైన ఎలా ఇస్తారు అని ఆమె వద్దకు కథలు తీసుకెళ్లినా రెమ్యునరేషన్ చూసి ఆగిపోయారంట పలువురు నిర్మాతలు. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి.
కానీ ఇటీవల వెంటవెంటనే రెండు సినిమాలు అనౌన్స్ చేసింది. తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా ప్రకటించారు. అలాగే కిచ్చ సుదీప్ 47వ సినిమాలో కూడా శ్రీనిధిని హీరోయిన్ గా ప్రకటించారు. 2022 లో కోబ్రా సినిమా వచ్చిన తర్వాత ఇప్పటివరకు సినిమాలు అనౌన్స్ చేయని శ్రీనిధి ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేసింది.
అయితే ఈ సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గించిందని సమాచారం. సుదీప్ సినిమా ఏమో కానీ సిద్ధూ సినిమా అయితే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చే బడ్జెట్ సినిమా కాదు. దీంతో శ్రీనిధి ఆఫర్స్ లేకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించిందని, అందుకే ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ ని ఓకే చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇకనైనా రెమ్యునరేషన్ మీద కాకుండా కొన్ని రోజులు కెరీర్ మీద ఫోకస్ చేస్తుందేమో చూడాలి.