Srinidhi Shetty No Movie Offers Due To Remuneration Hike
Srinidhi Shetty: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలు బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేశాయో మనం చూశాం. ఈ సినిమాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా, ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి కూడా ఒకేసారి ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఈ సినిమాల సక్సెస్‌తో హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమ రెమ్యునరేషన్ పెంచేసుకున్నారు.
Srinidhi Shetty : నాకు డబ్బే కావాలి అంటున్న KGF హీరోయిన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసి..
అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. హీరో యశ్ అప్పుడే తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టాడు. కానీ హీరోయిన్ శ్రీనిధి మాత్రం ఇంకా తన నెక్ట్స్ మూవీని ఓకే చేయలేకపోయింది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఆమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. కేజీయఫ్2 తరువాత అమ్మడు తన రెమ్యునరేషన్ ఎవరూ ఊహించని విధంగా పెంచేయడంతో ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాతలు వెనకాముందు ఆడుతున్నారట.
Srinidhi Shetty : ఏ భాషలో నటించడానికైనా రెడీ.. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..
పోనీ సినిమాలు వచ్చి వెళ్తున్నాయి కదా అని.. అమ్మడు తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందేమో అని అనుకుంటే.. ఆమె మాత్రం ససేమిరా అంటోదట. దీంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆమె చెంతవరకు వచ్చి తిరిగి వెళ్లాయట. అయితే శ్రీనిధి శెట్టి ఇప్పటికైనా తన రెమ్యునరేషన్ విషయంలో తగ్గకపోతే, ఆమెకు సినిమా ఛాన్సులు రావడం చాలా కష్టమని శాండిల్‌వుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంపై శ్రీనిధి శెట్టి ఏమంటుందో చూడాలి.