Srinivas Avasarala : అవతార్-2 సినిమాకు డైలాగ్ రైటర్‌గా అవసరాల శ్రీనివాస్..
దాదాపు 13 ఏళ్ళ క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్స్ తీసుకువస్తున్నాడు దర్శకుడు కామెరూన్. 'అవతార్ - ది వే ఆఫ్ వాటర్' అంటూ వస్తున్న ఈ సీక్వెల్ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. అదేంటంటే...

Srinivas Avasarala Penned Dialogues For Avatar2
Srinivas Avasarala : దాదాపు 13 ఏళ్ళ క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పటిలో ఒక విజువల్ వండర్ గా నిలిచింది. గ్రాఫిక్స్ ఉపయోగించి పండోరా అనే ఒక కొత్త గ్రహాన్ని సృష్టించి ఆడియన్స్ ని మరో ప్రపంచానికి తీసుకువెళ్లారు మేకర్స్. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్స్ తీసుకువస్తున్నాడు దర్శకుడు కామెరూన్.
Avatar 2 : రిలీజ్ కి ముందే కోట్లు కలెక్ట్ చేస్తున్న అవతార్ 2
‘అవతార్ – ది వే ఆఫ్ వాటర్’ అంటూ వస్తున్న ఈ సీక్వెల్ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. అదేంటంటే టాలీవుడ్ రైటర్ మరియు డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్.. ఈ సినిమాలో భాగం కానున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి ఈ తెలుగు రచయిత మాటలు రాయనున్నాడు.
సినిమాలోనే ఎమోషన్స్‌ని తన డైలాగ్స్ తో తెలుగువారి ఎమోషన్స్‌కి మ్యాచ్ చేయబోతున్నాడు. మరి అవసరాల మాటలతో అవతార సినిమా ఎలా ఉండబోతుందో ఈ శుక్రవారం థియేటర్లో చూడాల్సిందే. కాగా ఈ సినిమా విడుదలకు ముందే టికెట్ బుకింగ్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. ఇండియాలో మొదటి రోజే దాదాపు 2 లక్షల టిక్కెట్లు బుక్ అవ్వడంతో, ఫస్ట్ డేనే 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టేసింది.