Srinu Vaitla and Anil Ravipudi directing comedy scenes in Allu Arjun movie.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే విడుదలైన వీడియోకి ఎలాంటి (Allu Arjun)రెస్పాన్స్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ పత్రాలు చేస్తున్నారు.
ఈమధ్యే ఈ మూవీ సెట్స్ లోకి రష్మిక మందన్న కూడా అడుగుపెట్టింది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజువల్స్ తో ఈ సినిమా రానుంది అని టాక్ నడుస్తోంది. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Toxic Teaser: యష్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది.. విజువల్స్, యాక్షన్ సీన్స్ మాత్రం పీక్స్ అసలు
అదేంటంటే, హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ ను సెట్ చేస్తున్నాడట దర్శకుడు అట్లీ. అందుకోసం టాలీవుడ్ కామెడీ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి లను రంగంలోకి దించారట. ఈ సెన్స్ ని వాళ్ళతోనే రాయించి, వాళ్లనే డైరెక్ట్ చేయాల్సిందిగా సూచించాడట అట్లీ. ప్రస్తుతం దీనికి సంబందించిన వర్క్ జరుగుతుందని సమాచారం. ఈ స్పెషల్ కామెడీ టాక్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో నవ్విస్తుందట. అందుకే, ఇద్దరు దర్శకులను దానికోసమే తీసుకున్నారట.
దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే, ఈ విషయంలో ఆడియన్స్ నుంచి మాత్రం ట్రోలింగ్స్ వస్తున్నాయి. రూ.800 కోట్లతో చేస్తున్న సినిమాలో కామెడీ ఏంటి. అది కూడా శ్రీను వైట్ల, అనిల్ రావిపూడిలను తీసుకోవడం ఏంటి. అసలు ఏం చేస్తున్నారు సినిమాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ హీరో సినిమా అంటూ కామెడీ సినిమా తీయడం లేదు కదా అంటూ మరికొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్, అట్లీ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.