Gopichand 32 : ఇటలీలో శ్రీను వైట్ల, గోపీచంద్ మూవీ.. యాక్షన్ మూవీతో..
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా..

Srinu Vaitla starts locations search for Gopichand 32 movie
Gopichand 32 : మాచో స్టార్ గోపీచంద్ ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గోపీచంద్ 32వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలోనే దర్శకుడు షూటింగ్ లొకేషన్స్ ని వెతికే పనిలో పడ్డాడు. ఇక నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు కావడంతో సినిమా నిర్మాతలు విషెస్ తెలియజేస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు.
Bigg Boss Telugu 7 Elimination : మూడో వారంలో ఎలిమినేట్ కానుంది ఎవరో తెలుసా..?
ఇటలీలో ఈ మూవీకి సంబంధించిన లొకేషన్స్ సెర్చ్ జరుగుతుంది. మొదటి షెడ్యూల్ ని అక్కడే ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ లొకేషన్స్ సెర్చ్ కి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తన స్టైల్ లోనే యాక్షన్ విత్ కామెడీతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దూకుడు తరువాత ఈ దర్శకుడు నుంచి వచ్చిన సినిమాలు అన్ని నిరాశ పరుస్తూ వచ్చాయి.
Atlee : హాలీవుడ్ నుంచి అట్లీకి కాల్ వచ్చిందట.. స్పానిష్‌లో తన నెక్స్ట్ మూవీ..
View this post on Instagram
మరి ఈ సినిమాతో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇస్తాడా..? లేదా..? చూడాలి. ఒక పక్క గోపీచంద్ కూడా ఇటీవల ‘రామబాణం’తో ప్లాప్ ని అందుకున్నాడు. ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో ‘భీమ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. డైరెక్టర్ హర్ష కన్నడలో అనేక మాస్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. మరి ఈ చిత్రంతో గోపీచంద్ కి సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా.. తను కూడా టాలీవుడ్ లోకి హిట్ ఎంట్రీ ఇస్తాడా..? అనేది చూడాలి.