Mahesh Babu-Rajamouli movie completes Kenya schedule
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, అందులోను మహేష్ బాబూ హీరో అవడంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న (SSMB 29)న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. గ్లోబ్ ట్రాటర్ అంటే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mirai OTT Release: బ్లాక్ బస్టర్ మిరాయ్ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పటినుండో తెలుసా?
అదేంటంటే, మహేష్-రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు ఇటీవలే కెన్యా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అక్కడ షూటింగ్ సంబంధించి లీక్ అయినా ఫొటోస్ ఏ రేంజ్ సోషల్ మీడియాను షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్ర పట్టుకొని కనిపించిన మహేష్ బాబు లుక్ నెక్స్ట్ లెవల్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేశారు. జస్ట్ లీకైన చిన్న స్టిల్ కే ఈ రేంజ్ వైబ్ క్రియేట్ అయ్యిందట ఒరిజినల్ పోస్టర్ వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, కెన్యా షెడ్యూల్ లో అక్కడి అడవుల్లో భారీ ఛేజింగ్ సీన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించారట మేకర్స్.
ఈ షెడ్యూల్ తరువాత టీం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగనుంది. ఈ సెట్ కాశీ క్షేత్రానికి సంబందించినది అని టాక్ నడుస్తోంది. ఈ షూట్ లో సినిమాలో ఉన్న మెయిన్ స్టార్స్ పాల్గొనున్నారు. ఈ షూటింగ్ అక్టోబర్ 10వ తేదీ వరకు జరుగనుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది. నవంబర్ లో ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదల చేయనున్నట్లు టీం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. 2026 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.