Star Anchor : డబ్బుల కోసం ఒకప్పుడు గోల్డ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా.. ఇప్పుడు స్టార్ యాంకర్.. ఎమోషనల్ జర్నీ..
ఓ స్టార్ యాంకర్ తను యాంకర్ అవ్వకముందు డబ్బుల కోసం చేసిన పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఎమోషనల్ అయింది.
- Saketh U
- Published On : February 16, 2026 / 08:53 PM IST
Star Anchor
Star Anchor : చాలామంది సినీ సెలబ్రిటీలు కెరీర్ ఆరంభంలో కష్టపడిన వాళ్ళే. సినీ పరిశ్రమ రాకముందు బయట జాబ్స్ చేసిన వాళ్లే. తాజాగా ఓ స్టార్ యాంకర్ తను యాంకర్ అవ్వకముందు డబ్బుల కోసం చేసిన పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఎమోషనల్ అయింది.
ఇంతకీ ఆ యాంకర్ ఎవరో అనుకుంటున్నారా? బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని, యాంకర్ గా సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అయి పాపులారిటీ తెచ్చుకున్న స్రవంతి చొకారపు.
Also See : Praneeta Patnaik : కేరాఫ్ కంచరపాలెం నటి.. ఇప్పుడు హాట్ హాట్ ఫోజులతో.. ప్రణీత పట్నాయక్ ఫోటోలు వైరల్..
తాజాగా యాంకర్ స్రవంతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఆరో తరగతి నుంచే మెహందీ పెట్టేదాన్ని నేను. బ్యూటీ పార్లర్ తో టై అప్ అయి మెహందీ పని చేసి డబ్బులు సంపాదించేదాన్ని. యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. కానీ అప్పుడు మా లవర్ తో పెళ్లి కోసం వాళ్ళ ఇంట్లో సినిమాలు అంటే ఒప్పుకోరు అని సినిమాలు వదిలేసా.
పెళ్లి అయ్యాక కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడంతో నేను కూడా జాబ్ చేయాల్సి వచ్చింది. దాంతో గోల్డ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేశా. ఇక్కడే హైదరాబాద్ పంజాగుట్టలో ఓ షాప్ లో పనిచేశా. కానీ ఆ జాబ్ కి ఎక్కువ సేపు నిల్చోవాలి. ఎక్కువ సేపు నిల్చోవడంతో హెల్త్ ఇష్యూస్ వచ్చి నా వల్ల కావట్లేదు అని మా ఆయనకు చెప్పి మానేసాను. ఆ తర్వాత మా ఆయన ఫ్రెండ్ అభిరామ్ అనే వ్యక్తితో పరిచయం అయి ఓ ఛానల్ లో యాంకర్ గా మొదలుపెట్టాను. అక్కడ్నుంచి యాంకర్ గా నా కెరీర్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Image Credits : Filmy Focus Youtube Channel
Also Read : Chiranjeevi : చిరంజీవి షోల్డర్ కి ఆపరేషన్ చేసింది ఇతనే.. చిన్న సర్జరీనే అంటూ మెగాస్టార్ పోస్ట్ వైరల్..
