Ram Charan : పెద్ది మూవీ షూటింగ్లో గాయపడ్డ రామ్చరణ్.. త్వరగా కోలుకోవాలనీ పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
పెద్ది సినిమా షూటింగ్లో రామ్చరణ్ (Ram Charan) గాయపడ్డారు.
Ram Charan injured on Peddi movie shooting Pawan kalyan wishes speedy recovery
- పెద్ది సినిమా షూటింగ్లో రామ్చరణ్కు గాయం
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్లో రామ్చరణ్ గాయపడినట్లు సమాచారం.
కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రామ్చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఈ గాయంపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదంది. వైద్యుల సూచన మేరకు చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది.
రామ్చరణ్ త్వరగా కోలుకోవాలి..
పెద్ది చిత్రీకరణలో గాయపడిన రామ్చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు.
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి
అగ్రశ్రేణి యువ కథానాయకుడు @AlwaysRamCharan ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)@PawanKalyan
ఉప ముఖ్యమంత్రి— JanaSena Party (@JanaSenaParty) March 25, 2026
‘పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్చరణ్ గాయపడ్డారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Puri Jagannadh Daughter : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర క్యూట్ ఫోటోలు వైరల్..
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది చిత్రం తెరకెక్కుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
