ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్ ఎండ్ గేమ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఆడియన్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు సెలబ్రిటీల వంతు వచ్చింది. టాలివుడ్ స్టార్స్ అంతా ఒక్కొక్కరూ ఎండ్ గేమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
టాలివుడ్ సూపర్ హీరోలు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దెగ్గర పాతుకుపోయిన రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. రిలీజై పదిరోజులు గడుస్తున్నా అవెంజర్స్ ఎండ్ గేమ్ నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 300 కోట్లకిపైగా వసూళ్లు సాధించిన ఫస్ట్ హాలివుడ్ మూవీగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది.
మొన్నటిదాకా ఎండ్ గేమ్ మూవీకి ఆడియన్స్ క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో సెలబ్రిటీలు కాస్త దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక్కొక్కరు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు తన ఓన్ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో మూవీని చూశాడు.
మల్టీప్లెక్స్ సిబ్బందితో కలిసి దిగిన ఫోటోస్ ని మహేశ్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. అవెంజర్స్ ఎండ్ గేమే AMBలో మహేశ్ చూసిన ఫస్ట్ మూవీ. మల్టీప్లెక్స్ నిర్మించిన తర్వాత ఇప్పటిదాకా మహేశ్ అందులో ఒక్క సినిమా కూడా చూడలేదు. లేటెస్ట్ గా యంగ్ హీరో అఖిల్, అంతకుముందు వైసీపీ అధినేత జగన్ కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని AMB సినిమాస్ లో చూసి ఎంజాయ్ చేశారు.