Anil Ravipudi : సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనిల్ రావిపూడి.. ఇకపై అలా చేస్తే అంటూ హెచ్చరించిన అనిల్..
తాజాగా ఓ విషయంలో అనిల్ రావిపూడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.

Star Director Anil Ravipudi Complaints to Cyber Police for Fake Videos on him
Anil Ravipudi : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్స్ కొడుతూ వస్తున్నాడు. ఇటీవల వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి మొదటి రీజనల్ సినిమాగా నిలిచింది. ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పనిచేయబోతున్నాడు.
అయితే తాజాగా ఓ విషయంలో అనిల్ రావిపూడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. సంక్రాతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత గత కొన్ని రోజులుగా అనిల్ రావిపూడి పై పలు నెగిటివ్ వార్తలతో కొన్ని వీడియోలు చేసి ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి దీనిపై స్పందించాడు.
Also Read : Chhaava : విక్కీ కౌషల్, రష్మిక ‘ఛావా’ ఓవరాల్ 1000 కోట్ల సినిమా అవుతుందా? అందులో తెలుగు టార్గెట్ ఎంత..?
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది నా గురించి ఇష్టమొచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. వాటికి వాయిస్ ఓవర్ లు ఇచ్చి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఆ వీడియోలు చుసిన మా బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా భార్యకు ఆ వీడియోలు పంపి ఏంటి ఇదంతా, మీ ఆయన గురించి ఇలా చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే నేను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మర్యాదగా వీడియోలు తీసేస్తే మంచిది. ఇకపై నా గురించి మాత్రమే కాదు ఎవరి గురించి ఇలాంటి వీడియోలు చేయకండి. ఒకవేళ చేస్తే సైబర్ పోలీసులు మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఎవరి గురించి తప్పుడు ప్రచారాలు చేయకండి. క్లిక్స్, వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్టు కథలు అల్లి వీడియోలు చేస్తే వాటి వల్ల ఎంతోమంది, వారి ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.