Star director Sukumar to produce Kiran Abbavaram's next film
ఒక హిట్టు ఎవరి ఫేట్ అయినా మార్చేస్తుంది. నిన్న మొన్నటివరకు అసలు ఇతను హీరోనా.. ఒకటి రెండు అవకాశాలు అంతే అంతకుమించి రావడం కష్టమే అనుకున్నారు అంతా. కానీ, ఇప్పుడు ఆ హీరోనే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఒక్క హిట్టు.. కేవలం ఒక్క ఆ హీరో ఫేట్ మొత్తం మార్చేసింది. ఆ హీరో మరెవరో కాదు కిరణ్ అబ్బవరం. ‘క’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా కె-ర్యాంప్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో చెప్పి మరీ సూపర్ హిట్ కొట్టాడు. దీంతో కిరణ్ అబ్బవరం రేంజ్ మారిపోయింది.
Ritika Nayak: సిల్వర్ కలర్ శారీలో స్వీట్ రితికా.. ఎంత క్యూట్ గా ఉందో..
అందుకే తన తరువాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే కిరణ్ అబ్బవరం గురించి తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. త్వరలో కిరణ్ అబ్బవరం స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. సుకుమార్ శిష్యుడు వీర కోగటం ఇటీవల కిరణ్ అబ్బవరంకు ఒక కథను వినిపించాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట కిరణ్. సుకుమార్ స్టైల్లో సరికొత్త పాయింట్ తో రానున్న ఈ సినిమాను స్వయంగా సుకుమార్ తన స్వంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని టాక్.
ఇక ఈ సినిమా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని తెలుస్తోంది. సుకుమార్ తన అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటాడు. కాబట్టి, ఈ ప్రాజెక్టుకు కూడా ఆయన్నే మ్యూజిక్ అందించాలని అడగనున్నాడట సుకుమార్. సుకుమార్ అడిగాక దేవి ఎలాగూ నో చెప్పలేడు. కాబట్టి, కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తన నెక్స్ట్ సినిమా కోసం సుకుమార్, దేవి లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం అంటే కిరణ్ అబ్బవరం ఫేట్ ఇక మారిపోయింది అనే చెప్పాలి. ఈ సినిమా గనక హిట్ అయ్యింది అంటే ఇక మనోడిని ఆపడం ఎవరితరం కాదు.