Kulasekhar : స్టార్ పాటల రచయిత కన్నుమూత.. భారీ సినిమాలు, దొంగతనాలు, జైలు.. సినిమాని మించిన లైఫ్ స్టోరీ..

జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కులశేఖర్ ఆ తర్వాత గీత రచయితగా మారాడు.

  • Updated on- November 26, 2024 / 03:15 PM IST

Star Lyric Writer Kulasekhar Passed Away

Kulasekhar : తాజాగా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఒకప్పటి స్టార్ గీత రచయిత కులశేఖర్ నేడు ఉదయం మరణించారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొనగా పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే కులశేఖర్ లైఫ్ స్టోరీ సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.

జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కులశేఖర్ ఆ తర్వాత గీత రచయితగా మారాడు. ఎక్కువగా తేజ సినిమాల్లో పాటలు రాసాడు. చిత్రం, ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు.. ఇలా చాలా హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలు అందించాడు. ఒకానొక దశలో మంచి సక్సెస్ చూసాడు. కానీ సడెన్ గా అవకాశాలు ఆగిపోవడంతో మానసికంగా కుంగిపోయి డబ్బుల కోసం దొంగతనాలు కూడా చేసాడు. పలు మార్లు దొంగతనాలు చేసి పోలీసులు పట్టుకోవడంతో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు.

Also Read : Unstoppable with NBK S4 : మ‌రోసారి బాలయ్య షోలో శ్రీలీల‌.. అన్‌స్టాప‌బుల్‌లో ఆ హీరో కూడా..

అనంతరం మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న కులశేఖర్ ఇవాళ మరణించాడు అని తెలియడంతో అయ్యో పాపం అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.