Unstoppable with NBK S4 : మ‌రోసారి బాలయ్య షోలో శ్రీలీల‌.. అన్‌స్టాప‌బుల్‌లో ఆ హీరో కూడా..

ఆహా వేదిక‌గా నంద‌మూరి న‌ట‌సింహం హోస్ట్‌గా వ్య‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ దూసుకుపోతుంది.

Unstoppable with NBK S4 : మ‌రోసారి బాలయ్య షోలో శ్రీలీల‌.. అన్‌స్టాప‌బుల్‌లో ఆ హీరో కూడా..

Kissik beauty Sreeleela to appear on Unstoppable with NBK

Updated On : November 26, 2024 / 3:18 PM IST

ఆహా వేదిక‌గా నంద‌మూరి న‌ట‌సింహం హోస్ట్‌గా వ్య‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షో దూసుకుపోతుంది. విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి కాగా ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్‌లు ప్ర‌సారం అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌, నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు.

అల్లు అర్జున్ వ‌చ్చిన ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌గా అద‌రిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. ఇక త‌రువాతి ఎపిసోడ్‌కు గెస్ట్ గా ఎవ‌రు రానున్నాను అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. డ్యాన్సింగ్ క్వీన్, టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల ఈ షోలో సంద‌డి చేయ‌నుంది.

Pushpa 2 : హమ్మయ్య పుష్ప 2 షూటింగ్ ఇవాళ్టికి అయింది.. రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు..

ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్ప‌టికే శ్రీలీల హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. స్లీవ్‌లెస్ టాప్‌, ఎరుపు, న‌లుపు క‌లిసిన చీర‌తో క్యార‌వాన్ ముందు నిలుచుకున్న శ్రీలీ స్టిల్స్ ఆక‌ట్టుకుంఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్ర‌సారం అవుతుందా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Shritej : సినీ న‌టుడు శ్రీతేజ్ పై కేసు న‌మోదు..!

బాల‌య్య షోకి శ్రీలీల రావ‌డం ఇది రెండోసారి. గ‌తంలో భ‌గ‌వంత్ కేస‌రి మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో క‌లిసి వ‌చ్చింది. కాగా.. ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. కిస్సిక్ పేరుతో వ‌చ్చిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ షోకి హీరో న‌వీన్ పొలిశెట్టి సైతం వ‌చ్చాడు. కొన్నాళ్ల క్రితం ఈ యువ హీరోకి యాక్సిడెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్నాడు. బాల‌య్య షోతో అత‌డు రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఆయ‌న షోకి వ‌స్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

వీరిద్ద‌రు ఒకే ఎపిసోడ్‌లో క‌నిపించ‌నున్నారా? లేదంటే వేరువేరు ఎపిసోడ్‌లో క‌నిపించ‌నున్నారా ? తెలియాల్సి ఉంది.