Shritej : సినీ న‌టుడు శ్రీతేజ్ పై కేసు న‌మోదు..!

ప్ర‌ముఖ సినీ న‌టుడు శ్రీతేజ్ పై కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

Shritej : సినీ న‌టుడు శ్రీతేజ్ పై కేసు న‌మోదు..!

case filed on Shritej in Kukatpally Police Station

Updated On : November 26, 2024 / 1:06 PM IST

ప్ర‌ముఖ సినీ న‌టుడు శ్రీతేజ్ పై కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని ఓ యువ‌తి కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తును చేప‌ట్టారు.

కాగా.. శ్రీతేజ్ పై గ‌తంలోనూ ఓ కేసు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఓ మహిళతో ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉంది. ఈ విష‌యం తెలిసి ఆ మ‌హిళ భ‌ర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ స‌భ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Ram charan : ఆర్‌సీ 16 కోసం స‌రికొత్త లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌.. ఫోటో షేర్ చేసిన ద‌ర్శ‌కుడు

ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే తాజాగా మ‌రో కేసు న‌మోదైంది. దీంతో శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు.