Ram charan : ఆర్‌సీ 16 కోసం సరికొత్త లుక్‌లో రామ్‌చరణ్.. ఫోటో షేర్ చేసిన దర్శకుడు
చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు.

Director Buchibabu shares a pic of Ram charan makeover
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ తన కొత్త సినిమాను మొదలు పెట్టారు. బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ని పిలిపించారు. ఆయన రామ్ చరణ్ కు సరికొత్త హెయిర్ స్టైల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్, అకీమ్ హకీమ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చరణ్ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Allu Arjun : పుష్ప 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకోనున్న అల్లు అర్జున్ ?
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మైసూర్‌లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. మైసూర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం పోలీసుల వేట.. అరెస్ట్ పై పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు..
View this post on Instagram